
దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో దళితబంధు పథకంలో జరిగిన అవినీతిని గుర్తించి, మోసపోయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సోమన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేశ్, సీసీఎం మండల కార్యదర్శి కడెం లింగన్న, బీజేపీ నేత ధరావత్ సంతోష్, వైఎస్సార్ టీపీ నేత ఏపూరి యాకన్న మాట్లాడుతూ గ్రామంలో దళితబంధు పథకంలో లబ్దిదారులకు అందజేసిన గేదెల యూనిట్లలో రూ.10 లక్షలకు గాను కేవలం నాలుగు గేదెలు మాత్రమే ఇచ్చి యూనిట్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు వెంటనే కమిటీని నియమిస్తామని, లబ్దిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment