నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన తాజా చిత్రం మన్యం ధీరుడు’. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాడు. ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేస్తున్నారట. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారట.
(చదవండి: తెలుగు ప్రేక్షకులకు ఇన్నాళ్లకు కాస్త గౌరవం)
మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. పవన్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment