Is Actor Naresh Married Pavitra Lokesh Two Months Before? Deets Inside - Sakshi
Sakshi News home page

Naresh-Pavitra Lokesh: నరేశ్‌-పవిత్ర పెళ్లిలో షాకింగ్‌ ట్విస్ట్‌.. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారా?

Published Fri, Mar 10 2023 4:00 PM | Last Updated on Fri, Mar 10 2023 5:02 PM

Is Actor Naresh Married Pavitra Lokesh Two Months Before Deets Inside - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌, నటి పవిత్ర లోకేశ్‌ పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాము ఒక్కటయ్యామంటూ ఈ రోజు(మార్చి 10న) నరేశ్‌ అధికారిక ప్రకటన ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరి పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. అయితే ఈ వివాహ ప్రకటనలో నరేశ్‌ షాకింగ్‌ ట్వీస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాలో భాగంగా తీసిన వీడియో క్లిప్‌ను నరేశ్‌ షేర్‌ చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నెటిజన్లు నరేశ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరె ఎంట్రా ఇది... ఎన్ని సార్లు ఫూల్‌ చేస్తావంటూ నరేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్‌-పవిత్ర?

ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ రోజు నరేశ్‌ ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ పెళ్లి వీడియో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ట్విటర్‌ యూజర్‌ స్పందిస్తూ నరేశ్‌-పవిత్రల గురించి షాకింగ్‌ విషయం బయటపెట్టారు. ‘‘పవిత్ర బంధం’ అంటూ ఈ రోజు నరేశ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన పెళ్లి వీడియో నిజం కాదు. రెండు నెలల క్రితమే నరేష్‌, పవిత్రను వివాహం చేసుకున్నాడు. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఓ సినిమాలోనిది. దీనికి ఎం ఎస్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

చదవండి: అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్‌ వేణు

దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇది నిజమా? అంటూ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. దీంతో నరేశ్‌పై తమదైన స్టైల్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాగా నరేశ్‌ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. మూడవ భార్య రమ్య రఘుపతి విడాకుల వ్యవహరం ఇంకా కోర్టులోనే ఉంది. మరోవైపు పవిత్రకు కూడా ఇదివరకే రెండుసార్లు పెళ్లై విడాకులైన సంగతి తెలిసిందే. సమ్మోహనం మూవీ సమయంలో పవిత్ర-నరేశ్‌లు మధ్య పరిచయం ఏర్పడగా అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపై రూమర్స్‌ రాగా న్యూ ఇయర్‌ సందర్భంగా తమ రిలేషన్‌పై నరేశ్‌ అధికారిక ప్రకటన ఇచ్చాడు. కాగా ప్రస్తుతం నరేశ్‌-పవిత్రలు దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement