
సెలబ్రిటీలుగా మా గురించి మాట్లాడే హక్కు ఉంటుందేమో కానీ మమ్మల్ని కించపరిచే హక్కు మీకు లేదు. ఒక వ్యక్తి బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో దాక్కుని చూసినట్లుగా వారి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ
సినీనటుడు నరేశ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోమంటూ గతంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు సమర్పించారు. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవడానికి తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
'ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. సెలబ్రిటీలుగా మా గురించి మాట్లాడే హక్కు ఉంటుందేమో కానీ మమ్మల్ని కించపరిచే హక్కు మీకు లేదు. ఒక వ్యక్తి బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో దాక్కుని చూసినట్లుగా వారి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య డిస్టబింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకు వచ్చిందో కనుక్కునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వచ్చాను. ఆ కేసులో పోలీసులకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. వీటి రిజల్ట్ కూడా త్వరలోనే మీడియాకు చెప్తాను' అని చెప్పుకొచ్చాడు నరేశ్.