
నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నరేష్‌తో పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో అటు మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ వీరిద్దరి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
ఒక రకంగా ఈ వివాదం ఆమెకు బాగానే క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
తెలుగులో అమ్మ, వదిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటి నరేష్ వ్యవహారంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకు రోజుకు 50 నుంచి 75 వేలు తీసుకుంటున్న పవిత్రా లోకేష్ ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట.
అంతేకాకుండా ఆమెకు ఆఫర్స్ రావడంలో నరేష్ కూడా తన వంతు సాయం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.