నరేశ్‌-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్‌ నుంచీ ఇదే జరుగుతుంది! | Actor Naresh Son Naveen Interesting Comments On His Father And Pavitra Lokesh Relationship - Sakshi
Sakshi News home page

Actor Naveen: పవిత్రతో నరేశ్‌ లవ్‌స్టోరీ.. నటుడి తనయుడు ఆసక్తికర కామెంట్స్‌

Published Wed, Aug 23 2023 1:31 PM | Last Updated on Wed, Aug 23 2023 2:10 PM

Naveen About Naresh, Pavitra Lokesh Relationship - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌ కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాలు, పవిత్ర లోకేశ్‌తో ప్రేమాయణం.. ఆపై కోర్టు కేసులు ఇలా వీటితోనే సెన్సేషనల్‌ అవుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే అతడి మొదటి భార్య తనయుడు నవీన్‌ మొదట్లో నటుడిగా కనిపించి సత్య అనే షార్ట్‌ ఫిలింతో దర్శకుడిగా మారాడు.

తాజాగా అతడు తన తండ్రి గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీలో ఎవరికి ఏది కరెక్ట్‌ అనిపిస్తే అదే చేస్తారు. ఎవరి మీదా ఆధారపడరు. మొదటి నుంచీ అదే జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరి గురించి నేను చెడుగా ఫీలవలేదు. జనాలు మా కుటుంబం గురించి ఏది పడితే అది వాగినా నేను పట్టించుకోలేదు. జనాలకు నచ్చినట్లు బతకలేం కదా.. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. అతడు సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేదే మాకు కావాల్సింది!

బయట ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతాడు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం. పవిత్ర లోకేశ్‌ నాకు ఎప్పటినుంచో తెలుసు. చాలా మంచావిడ. నేను ఏదైనా ప్రాజెక్ట్‌ చేస్తున్నానంటే ఆల్‌ ద బెస్ట్‌ చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను. తనను పవిత్రగారు అని పిలుస్తుంటాను' అని నవీన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: మిస్టర్‌ ప్రెగ్నెంట్‌.. డెలివరీ అదిరిపోయింది.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement