Vijayanirmala
-
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) -
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కట్టబెట్టారు : విజయనిర్మల
-
సింహపురితో ఎనలేని అనుబంధం
సాక్షి, నెల్లూరు : నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సుప్రసిద్ధురాలైన విజయనిర్మలతో సింహపురికి ఎనలేని అనుబంధం ఉంది. ప్రఖ్యాత సినీ నటి విజయనిర్మల హఠాన్మరణం పట్ల నెల్లూరుకు చెందిన కళాకారులు, నటులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురువారం గుర్తుచేసుకున్నారు. నెల్లూరుకు 70వ దశకంలో ‘దేవుడు చేసిన మనుషులు’ శతదినోత్సవ వేడుకలకు నటిగా ఆమె హాజరయ్యారని, అలాగే గూడూరు ప్రాంతంలోజరిగిన ఓ చలనచిత్రం షూటింగ్లో పాల్గొన్నారని, కాంగ్రెస్‌పార్టీ నుంచి కృష్ణ పార్లమెంటుసభ్యుడిగా పోటీచేసిన సమయంలో ఆయనతోపాటు నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన ఆ పార్టీ ప్రచారసభల్లో సైతం విజయనిర్మల పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు. నటిగా, దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినప్పటికీ తన తోటి నటీనటులతో, దర్శకులతో, నిర్మాతలతో, అభిమానులతో ఎంతో హుందాగా, అప్యాయతానురాగాలతో వ్యవహరించేవారని విజయనిర్మలతో అనుబంధం ఉన్న వారు గుర్తుచేసుకున్నారు. ‘తుంగా’పండగలో పాల్గొన్న కృష్ణ, విజయనిర్మల దంపతులు లాయర్ వారపత్రిక వ్యవస్థాపకుడు, ప్రముఖ పాత్రికేయుడు తుంగా రాజగోపాలరెడ్డి జయంతిని పురస్కరించుకుని లాయర్ వారపత్రిక నిర్వహించిన ‘తుంగా’పండగలో నటశేఖర కృష్ణతో కలిసి విజయనిర్మల నెల్లూరుకి విచ్చేశారు. కేవీఆర్ పెట్రోల్‌బంక్ సమీపంలోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో 1998 నవంబర్ 8వ తేదీన లాయర్ వారపత్రిక వ్యవస్థాపకుడు తుంగా రాజగోపాలరెడ్డి 69వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘తుంగా’పండగలో నటశేఖర కృష్ణకు ‘తుంగా రాజగోపాలరెడ్డి’ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల సైతం పాల్గొన్నారు. ఆమెను సైతం నాడు ప్రముఖ వైద్యుడు సీఎంకే రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి, జేకేరెడ్డి, మాగుంట పార్వతమ్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
విజయనిర్మలకు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
విజయనిర్మల భౌతికకాయానికి సీఎం జగన్ నివాళి
సాక్షి, హైదరాబాద్: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సీనియర్ నటుడు కృష్ణ నివాసానికి చేరుకుని విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో కన్నీమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను ఓదార్చారు. తన తల్లికి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని సీఎం జగన్‌కు నరేశ్ తెలిపారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి. విజయసాయిరెడ్డి అన్నారు. నానక్‌రాంగూడ నుంచి విజయనిర్మల అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో జరగనున్నాయి. చిలుకూరులో ఉన్న ఫాంహౌస్‌లో ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణను పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్ -
గిన్నిస్ రికార్డ్‌కు తొలి అడుగు ‘నంద్యాల’ నుంచే
సాక్షి, నంద్యాల : ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మలకు తొలిసారిగా తెలుగులో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఘనత నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి దివంగత గాజుల పెద్ద మల్లయ్య. వెంకటకృష్ణ పతాకంపై హీరో కృష్ణ, హీరోయిన్ విజయనిర్మలను ఆయన మీన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమె.. ఆ తర్వాత తన ప్రతిభతో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్‌గా స్థానం సంపాదించారు. గాజుల మల్లయ్య వ్యాపారం రీత్యా 1965లో మద్రాస్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతో ఆయన 1970లో ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనరాణి రాసిన మీనా నవల ఆధారంగా అదే పేరుతో మిత్రుడు టీవీ రమణ సహకారంతో వెంకటకృష్ణ బ్యానర్‌పై చిత్రనిర్మాణం చేపట్టారు. కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్గా పెద్ద మల్లయ్య దర్శకత్వం బాధ్యతలను విజయనిర్మలకు అప్పగించారు. అలా ఆమె తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహించారు. సినిమా హిట్ కావడంతో విజయ నిర్మలకు మంచిపేరుతో పాటు అవకాశాలు కూడా దక్కాయి. తర్వాత 1974లో పెద్దమల్లయ్య ఇదే పతాకంపై దేవదాసు చిత్రాన్ని కృష్ణ, విజయనిర్మలతో ఆమె దర్శకత్వంలో నిర్మించారు. కాని ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోక పోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో పెద్ద మల్లయ్య చిత్రపరిశ్రమను వదిలేసి నంద్యాలకు వచ్చి వ్యాపారాన్ని కొనసాగించారు. పదేళ్ల క్రితం పెద్ద మల్లయ్య ఎస్బీఐ కాలనీలోని తన కుమారుడి ఇంట్లో ఉంటూ మృతి చెందారు. దర్శకురాలిగా విజయనిర్మల సాధించిన ఘనత వెనుక పెద్దమల్లయ్య ఇచ్చిన అవకాశం, ప్రోత్సాహం మరువలేనిది అని నంద్యాల సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒందిపోటు భీమన్న చిత్రం షూటింగ్ నంద్యాలలో.. మల్లికార్జున రావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, ఎస్వీ రంగారావు నటించిన చిత్రం బందిపోటు భీమన్న షూటింగ్ 1968లో నంద్యాల, ఆళ్లగడ్డ, అహోబిలంలో దాదాపు పది రోజుల పాటు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల నంద్యాలలో బస చేశారు. 1969 డిసెంబర్13న ఈ సినిమా విడుదలయ్యింది. -
అనుకోకుండా అవకాశం.. : విజయనిర్మల
సాక్షి, విశాఖ సిటీ : ‘మహానేత వైఎస్సార్‌ని రెండుసార్లు మాత్రమే కలిశాను. ఆయనకు ప్రతిపక్షం, అధికార పక్షమనే తేడా లేదు. సీఎంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలనూ సమానంగా చూశారు. చంద్రబాబుది మాత్రం దానికి పూర్తి వ్యతిరేకమైన మనస్తత్వం. అందుకే రాజన్న రాజ్యం తర్వాత ఇప్పుడు రావణరాజ్యంలా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి జగన్ ఓ భరోసా. పెద్దాయనలాంటి పాలన అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు నిజమైన సోదరుడు వైఎస్ జగన్ అని ప్రతి మహిళలోనూ బలంగా నాటుకుపోయింది’ అని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న అంతరంగం ఆమె మాటల్లోనే.. అనుకోకుండా అవకాశం.. నా భర్త వెంకటరమణ రాజకీయ నాయకుడిగా భీమిలి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2005లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో మా స్థానం మహిళకు కేటాయించడంతో అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలినై ఉండటంతో గెలుపు అవకాశం తలుపు తట్టింది. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలో ప్రయాణించాను. వైఎస్సార్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను.. 2008 డిసెంబర్లో రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్పుడే పెద్దాయనను తొలిసారి చూశాను. ముఖ్యమంత్రి అంటే.. గంభీరంగా ఉంటారు, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులతోనే మాట్లాడతారన్న ఆలోచన ఉండేది. కానీ.. ఆయన్ని చూడగానే నా ఆలోచన తప్పు అని అర్థమైంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో పలకరించారు. అందరితో సరదాగా మాట్లాడి సమస్యలన్నీ సానుకూలంగా విన్నారు. భీమిలి సమస్యల గురించి చెప్పగానే టీడీపీ అని తెలిసి కూడా.. రాజన్న స్పందించిన తీరు చూసి ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను. మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం రూ.50 లక్షలు, మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.17 కోట్లు, మురికివాడల అభివృద్ధికి రూ.3.35 కోట్లు.. ఇలా చెప్పిన సమస్యలన్నింటికీ నిధులు మంజూరు చేశారు. రాజన్నకి.. చంద్రబాబుకి తేడా అదే.. నేను టీడీపీకి చెందిన చైర్‌పర్సన్‌నని వైఎస్సార్‌తో అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి.. నువ్వు ఏ పార్టీ అయితే ఏంటమ్మా.. మా రాష్ట్రంలోనే ఉన్నావుగా.. నీ మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే.. ఏపీలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టే కదా.. అని నవ్వుతూ బదులిచ్చారు. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండన్నారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక ముఖ్యమంత్రి అంతటి విజన్‌తో ఆలోచిస్తారా! అని అనుకున్నాను. చంద్రబాబుకీ, వైఎస్సార్‌కు ఉన్న తేడా అదే. రాజన్న రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతారు. చంద్రబాబు మాత్రం తన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న ప్రాంతాలకే నిధులు ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ అంటే చాలు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందనీయరు. ఇటీవలే ఓ వేదికపై ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే అంగీకరించారు కదా.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడితో.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది.? మళ్లీ జగన్‌లో చూశాను.. పెద్దాయన మరణించాక.. నాకు చాలా బాధనిపించింది. 2011లో ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 2012లో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాను. చిన్నవాళ్లకు మర్యాద ఇచ్చే నైజం జగన్‌లో చూసినప్పుడు రాజన్నే గుర్తొచ్చారు. బహుశా.. జగనన్న వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన వారెవరూ ఆయన్ని విడిచి వెళ్లే ఆలోచన చేయరు. నడిచొస్తున్న నమ్మకాన్ని చూశా.. విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర అడుగుపెట్టినప్పటి నుంచి పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని జిల్లాల్లోనూ జరిగిన పాదయాత్రను ప్రసార మాధ్యమాల్లో చూశాను. నడిచొస్తున్న నమ్మకంలా ప్రజలకు జగన్ కనిపించారు. ఆయనొస్తేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలందరిలో నాటుకుపోయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. రాజన్న బిడ్డను గెలిపించుకుందామా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. వెలగపూడి ఇక విజయవాడకే... పదేళ్ల పాటు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు ప్రజలకు ఏం చేయలేదు. కేవలం ఆయన మద్యం వ్యాపారాన్ని, నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారే తప్ప.. ప్రజల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. గుర్రపు పందేలు, జూదాలు.. ఇలా ప్రజల సొమ్ముల్ని దోచుకుతినే ఎమ్మెల్యేగా చరిత్రపుటల్లో నిలిచిపోతారు. విశాఖ వంటి మహా నగరంలో తూర్పు నియోజకవర్గంలోని 3 వార్డుల్లో ఒక్క బస్టాప్ కూడా లేదంటే ఆయన పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా.. ఇప్పుడు మళ్లీ బెదిరింపు ధోరణులతో ఓటు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత.. ఎక్కడి నుంచైతే వెలగపూడికి వచ్చారో.. అక్కడికి రిటర్న్ వెళ్లిపోవాల్సిందే. అతివలకు అసలైన సోదరుడు చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా అధికారులపై ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. ఎన్నికలు రాగానే మహిళలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ.. పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. మహిళలెవ్వరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. అన్ని వర్గాల మహిళలకూ అండగా నిలబడేందుకు జగన్ వచ్చారు. ఆయన్ని చూస్తే.. మా అందరికీ అసలైన సోదరుడిగా అండగా ఉంటారన్న నమ్మకం కలిగింది. ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు మహిళలకు కేటాయించారంటే.. మహిళా సాధికారత జగన్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది. -
పార్టీకి జవసత్వాలు బూత్ కమిటీలే
పీఎంపాలెం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైన అధికార టీడీపీని మట్టికరిపించడానికి బూత్ కన్వీ నర్లు, సభ్యులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేయాలని భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల పిలు పునిచ్చారు. ఆదివారం శిల్పారామంలో ఆ పార్టీ 4,5,6 వార్డుల బూత్ కమిటీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజ ల ఉన్నతికోసం ప్రకటించిన నవరత్నాలును ప్రతి గడçపకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. మహానేత వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 5 వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులోని బూత్‌లకు చెందిన ఓట ర్లను కలసి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించాలన్నారు. పార్లమెంట్ బూత్ కమిటీ ఇన్చార్జి కిషోర్ మాట్లాడుతూ పార్టీకి జవసత్వాలు బూత్ కమిటీలే అన్నా రు. బూత్ కమిటీల విధులు బాధ్యతల గురించి సోదాహరణంగా వివరించారు. స్థానిక నాయకుడు పీవీజీ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగో వార్డు అధ్యక్షులు గాదె రోశిరెడ్డి , ఆరోవార్డు అధ్యక్షుడు లొడగల రామ్మోహన్, భీమిలి బూత్‌కమిటీ ఇన్చార్జి బి.రాజ్‌కుమార్,అన్నం వెంకటేశ్వర్లు , మహిళా విభాగం అధ్యక్షులు ధర్మాల సుజాత,ఎం.రాజేశ్వరి,కృపాజ్యోతి,పార్టీ స్టేట్ యూత్ సెక్రటరీ నల్లా రవికుమార్, సీనియర్ నాయకులు జేఎస్‌రెడ్డి , గుమ్మడి మధు, రాయిన సాయికుమార్, శివశంకరరెడ్డి పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
రజనీకాంత్ నటించిన ఏ సినిమాకి విజయనిర్మల దర్శకత్వం వహించారు? ఎ) రామ్ రాబర్ట్ రహీమ్ బి) దేవుడే గెలిచాడు సి) అంతం కాదిది ఆరంభం డి) ముఖ్యమంత్రి అఖిల్ పాత్ర పేరుతో నాగార్జున ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరేంటి? ఎ) మనం, బి) మాస్, సి) సూపర్ డి) భాయ్ చిరంజీవి పక్కన ఎక్కువ సినిమాల్లో నటించింది రాధిక. ఆ తర్వాతి స్థానం ఏ హీరోయిన్‌ది? ఎ) విజయశాంతి బి) రాధ సి) భానుప్రియ డి) సుమలత ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాణ సంస్థ ఏది? ఎ) అన్నపూర్ణ స్టూడియోస్ బి) వైజయంతి మూవీస్ సి) గీతా ఆర్ట్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ వెంకటేశ్ ఓ సినిమాలో నాలుక కోసుకుంటారు... ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) ప్రీతీ జింతా సి) అమీషా పటేల్ డి) ట్వింకిల్ ఖన్నా సౌందర్య అసలు పేరు? ఎ) రమ్య బి) సౌమ్య సి) సాహిత్య డి) లాలిత్య కృష్ణ నటించిన ఏ సినిమా చూసిన తర్వాత మహేశ్‌బాబు హీరో అవ్వాలని నిర్ణయించుకున్నారు? ఎ) సింహాసనం బి) అల్లూరి సీతారామరాజు సి) గూఢచారి 116 డి) ఊరికి మొనగాడు మెగా ఫ్యామిలీలో మంచి ఎత్తున్న హీరో వరుణ్ తేజ్. ఈ యువ హీరో హైట్ ఎంత? ఎ) 6 అడుగుల 4 అంగుళాలు బి) 6 అడుగుల 2 అంగుళాలు సి) 6 అడుగుల 6 అంగుళాలు డి) 6 అడుగుల 5 అంగుళాలు పవన్ కల్యాణ్ తన ఫైట్స్‌ని తానే కంపోజ్ చేసుకున్న మొదటి చిత్రం? ఎ) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బి) గోకులంతో సీత సి) తమ్ముడు డి) జానీ ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన అన్ని తెలుగు చిత్రాల్లోనూ కథానాయికగా విజయశాంతి నటించారు.. ఆయనెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కోదండ రామిరెడ్డి సి) టి. కృష్ణ డి) ముత్యాల సుబ్బయ్య ‘అరుంధతి’లోని ‘జేజెమ్మా... జేజెమ్మా..’ పాట పాడిన గాయకుడు ఎవరు? ఎ) కె.జె. ఏసుదాస్ బి) ఖైలాష్ కేర్ సి) శంకర్ మహదేవన్ డి) హరిహరన్ ‘ఈగ’ సినిమా మాటల రచయిత ఎవరో తెలుసా? ? ఎ) యం. రత్నం బి) జనార్థన మహర్షి సి) సత్యానంద్ డి) విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి దర్శకత్వం వహించిన 11 సినిమాల్లో ఛాయాగ్రాహకుడు కేకే సెంథిల్‌కుమార్ ఎన్ని సినిమాలకు పని చేశారు? ఎ) 11, బి) 10 సి) 7, డి) 9 చిరంజీవి నటించిన ఏ సినిమాకి పవన్ కల్యాణ్ ఫైట్ కంపోజ్ చేశారు? ఎ) శంకర్‌దాదా ఎంబీబీఎస్ బి) అందరివాడు సి) డాడీ డి) మాస్టర్ బాలనటిగా రాశి నటించిన మొదటి సినిమా ఏది? ఎ) మమతల కోవెల బి) రావుగారి ఇల్లు సి) బాల గోపాలుడు డి) ఆదిత్య 369 వెంకటేశ్ ఎత్తుకున్న ఈ బుడతడు ఇప్పుడు హీరో.. అతనెవరు? ఎ) నాగచైతన్య బి) అఖిల్ సి) రానా డి) సుశాంత్ ప్రభాస్‌తో ప్రస్తుతం ‘సాహో’ సినిమా చేస్తున్న దర్శకుడి మొదటి సినిమా ఏది? ఎ) ఎక్స్‌ప్రెస్ రాజా బి) రన్ రాజా రన్ సి) జిల్ డి) వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ ఫొటో ఏ సినిమాలోనిది? ఎ) శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం బి) పాండురంగ మహత్మ్యం సి) నర్తనశాల డి) జగదేకవీరుని కథ బావలు సయ్యా.. మరదలు సయ్యా.. అనే సిల్క్ స్మిత ఫేమస్ సాంగ్ ఏ సినిమాలోనిది? ఎ) రుస్తుం బి) బావా బావమరిది సి) ఆదిత్య 369 డి) ఖైదీ నం. 786 ఇలియానాతో మహేశ్‌బాబు ‘క్యారియర్లు క్యారియర్లు..’ అనే డైలాగ్ చెప్పేటప్పుడు ఓ అల్పాహారం పేరు వస్తుంది.. ఆ టిఫిన్ ఏంటి? ఎ) దోసె, బి) ఇడ్లీ సి) వడ, డి) ఉప్మా -
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదు
నటి విజయనిర్మల ఫిర్యాదు రియల్ఎస్టేట్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు బంజారాహిల్స్: వ్యాపారంలో ఇబ్బందులున్నాయని నమ్మించి కోటి రూపాయలు హ్యాండ్‌లోన్ తీసుకొని ముఖం చాటేసిన ఓ కన్‌స్టక్ష్రన్ కంపెనీ నిర్వాహకులపై సినీదర్శక నిర్మాత, నటి జి. విజయనిర్మల కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. నానక్‌రాంగూడలో నివసించే నటుడు జిఎస్ఆర్ కృష్ణమూర్తి(కృష్ణ) సతీమణి విజయనిర్మలకు విజన్ మెడోస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ఆర్. శ్రీనివాసరాజు, ముదునూరి భద్రిరాజు, ముదునూరి సీతారామరాజులతో దాదాపు 20ఏళ్లుగా పరిచయం ఉంది. 2007లో తమకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు వచ్చాయని ఇందుకు కోటి రూపాయలు హ్యాండ్లోన్గా కావాలని వారు విజయనిర్మలను కోరారు. ఇందుకు అంగీకరించిన ఆమె మూడు విడతలుగా ఫిలింనగర్‌లోని ఆంద్రాబ్యాంకు చెక్కుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా చెల్లించకుండా కాలయాపన చేశారు. వారు ఇచ్చిన చెక్కులను ఫిలింనగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయగా అందులో డబ్బులు లేవంటూ బ్యాంకు ఆ చెక్కులను తిరస్కరించింది. ఈ విషయంలో వారిని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరాజు, మదునూరి భద్రిరాజు, మదునూరి సీతారామరాజులపై ఐపీసీ సెక్షన్ 420, 406, 156(3) సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లో శ్రీశ్రీ
ఈస్ట్‌మన్ కలర్లో రూపొందిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘తేనె మనసులు’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ , ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’తో తెలుగు తెరకు తొలి కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేశారు. తెలుగు మొదటి సినిమా స్కోప్ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎమ్ఎమ్ చిత్రం ‘రాజ సింహాసనం’... ఇలా తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారాయన. తాజాగా ‘శ్రీశ్రీ’తో ఈ సూపర్ స్టార్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా విదేశాల్లో ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కృష్ణ, విజయనిర్మల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై బాలురెడ్డి, షేక్సిరాజ్ నిర్మించారు. ‘‘ ‘శ్రీశ్రీ’ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఇంట్లోనే కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అని కృష్ణ అన్నారు. ఎమ్ఫ్లిక్స్ అధినేత రాజు నడింపల్లి మాట్లాడుతూ -‘‘కృష్ణగారు నటించిన ‘శ్రీశ్రీ’తో మా ఠీఠీఠీ.ఝజజ్ఠీఠీౌటఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రం కాబట్టి ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘కృష్ణగారిపై ఉన్న ప్రేమతో ‘శ్రీ శ్రీ’ సినిమా రూపొందించాను’’ అని దర్శకుడు చెప్పారు. -
ఆ ఇద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను: సూపర్‌స్టార్ కృష్ణ
‘‘తెలుగులో తొలి కౌబాయ్ సినిమా సహా ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కృష్ణది. అందుకే, రెబల్‌స్టార్ నేను కాదు కృష్ణే. అతను నిర్మాతల మనిషి మాత్రమే కాదు.. ఏటా 12-14 సినిమాలు చేసి, పరిశ్రమలో కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి’’ అని రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్ సిరాజ్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఇ.ఎస్. మూర్తి స్వరపరిచిన ఈ చిత్రం పాటలనూ, ప్రచార చిత్రాన్నీ గురువారం హైదరాబాద్‌లో మహేశ్‌బాబు ఆవిష్కరించారు. హీరోగా కృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శాలువా, సన్మానపత్రంతో కృష్ణను సత్కరించారు. కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘తేనెమనసులు’ ద్వారా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను హీరోని చేస్తే, ‘గూఢచారి 116’ ద్వారా నాకు మాస్ ఇమేజ్ తెచ్చి, 50 ఏళ్లు కెరీర్‌ని నడిపే బలం ఇచ్చారు నిర్మాత డూండీ. వారినెప్పటికీ మర్చిపోలేను. ఈ ‘శ్రీశ్రీ’ యాభై ఏళ్ల కెరీర్లో ఓ మైలురాయి’’ అన్నారు. ‘‘అందరి కన్నా కృష్ణగారికి అతి పెద్ద అభిమానిని నేనే. నాలుగు నెలల క్రితం ‘శ్రీశ్రీ’లో నాన్న గారి గెటప్ ఫోటో చూసి, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎగ్జయిట్ అయ్యా. చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అనిపిస్తోంది’’ అని మహేశ్‌బాబు అన్నారు. విజయనిర్మల మాట్లా డుతూ - ‘‘చాలా ఏళ్ల తర్వాత నేనూ, కృష్ణగారూ కలసి నటించాం. ఇప్పటివరకూ మేమిద్దరం కలసి 48 సినిమాలు చేశాం. ఇంకా రెండు సినిమాలు చేస్తే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, సంగీత దర్శకుడు ఇ.ఎస్. మూర్తి, నటులు నరేశ్, హీరో సుధీర్ బాబు, సినీ ప్రముఖులు కోదండరామిరెడ్డి, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈ పెద్దోడు చెబుతున్నాడు...బాక్సాఫీస్ బద్దలైపోతుంది : వెంకటేశ్
‘‘శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. మహేశ్ గ్లామరస్‌గా ఉన్నాడు. ఇండస్ట్రీలో ‘శ్రీమంతుడు’ గురించి టాక్ బాగుంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్టైన్మెంట్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హీరో వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం ట్రైలర్ చూశాక నేను రెండు సైకిల్స్ కొన్నాను. కానీ, సైకిల్ మీద నేను కొంచెం రఫ్‌గా కనిపించాను. (మహేశ్‌బాబుని ముద్దుగా సంబోధిస్తూ) మా చిన్నోడు చాలా స్మూత్‌గా, అందంగా ఉన్నాడు. ఈ పెద్దోడు చెబుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. బాక్సాఫీస్ బద్దలైపోతుంది’’ అన్నారు. సినీ నటుడిగా కృష్ణ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ఆయనను సత్కరించింది. ‘‘మహేశ్‌బాబు గెటప్ బాగుంది’’ అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. ‘‘మహేశ్‌బాబుతో వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయనున్నా. కథ సిద్ధం చేస్తున్నా’’ అని అతిథిగా పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ -‘‘దేవిశ్రీ ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆడియోలో ‘జాగో జాగో...’ నా కెరీర్లో మంచి సాంగ్. కొరటాల శివ ఈ చిత్రాన్ని చెప్పిన దానికన్నా బాగా తీశారు. తండ్రి పాత్రకు జగపతిబాబు గారు ఒప్పుకుంటారో లేదో అని అనుమానం వచ్చింది. కానీ, నేను, కొరటాల శివ కథ చెప్పగానే, వెంటనే ఓకే చెప్పారు. ఆ పాత్రను ఆయనకన్నా ఎవరూ బాగా చేయరు, నేను కమల్‌హాసన్ ఫ్యాన్‌ని. శ్రుతితో సినిమా చేస్తానని అనుకోలేదు. మీరెప్పుడూ (అభిమానులు) నా గుండెల్లో ఉంటారు. (‘ఆగడు’ చిత్రాన్ని ఉద్దేశించి) లాస్ట్ టైమ్ డిజప్పాయింట్మెంట్ చేశాను. అందుకు క్షమించండి. ఈసారి పుట్టినరోజుకు మీ అందరికీ మంచి హిట్ ఇస్తాను’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘ ‘దేవుడు అందం, ఓర్పుతో పాటు టాలెంట్ అన్నీ కలిపి మహేశ్‌బాబుకు ఇచ్చాడు’’అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ -‘‘టాలీవుడ్లో ప్రతిభ గల నటుల్లో ఒకరైన మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిజజీవితంలో కృష్ణగారు మహేశ్‌బాబు తండ్రీ కొడుకులుగా ఎంత అందంగా ఉన్నారో, ఈ సినిమాలో జగపతిబాబు, మహేశ్‌బాబు అలానే ఉంటారు’’ అన్నారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, కథానాయిక శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఇది యూత్ కల్చర్!
తరాలు మారే కొద్దీ యువతరంలో వస్తున్న మార్పులు, కట్టుబాట్లను కాదని ప్రవరిస్తున్న తీరు, ప్రతి పనిలోనూ వారి ఆలోచనా విధానం ఎలా ఉందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం - ‘కల్చర్’. షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.ఎస్.పి ఆనంద్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల క్లాప్ ఇచ్చారు. యూత్‌కు నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
సుధీర్‌బాబు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు : దాసరి
‘‘సుధీర్ బాబు ఈ టైటిల్‌తో సినిమా తీస్తున్నాడంటే కచ్చితంగా ఓ కౌబాయ్ సినిమా అనుకున్నా. కానీ ఇది ఓ డిఫరెంట్ స్టోరీ అని సుధీర్ చెప్పాడు. ఒక్కో సినిమాకు సుధీర్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు. మా చెల్లాయి విజయనిర్మల బాల నటిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లయింది. రచ యితగా నాకు కూడా 50 ఏళ్లు పూర్తయ్యాయి’’ అని డా. దాసరి నారాయణరావు చె ప్పారు లక్ష్మీ న రసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. బోస్ నె ల్లూరి దర్శకుడు. మణికాంత్ కద్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల పాటల సీడీను ఆవిష్కరించి చిత్ర సమర్పకులు శంకర్ చిగురుపాటికి అందజేశారు. హీరో కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇది చాలా మంచి టైటిల్. సుధీర్‌బాబు లుక్ డిఫరెంట్‌గా ఉంది. పాటలు, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణగారి ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని విజయనిర్మల అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘మహేశ్‌బాబు రాలేదేంటని చాలా మంది అడిగారు. ఆయన షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ చాలా మంది మహేశ్ (అభిమానులు)లు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని తర్వాత తెలిసింది. ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్ టైనర్. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు. ఈ వేడుకలో బొత్స సత్యనారాయణ, హీరోలు శ్రీకాంత్, సుశాంత్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణ, విజయనిర్మలకు పెళ్లి చేసింది నేనే..
ఉన్నత చదువు... మంచి మనసు... మాటల్లో నిజాయితీ...చేతల్లో నిబద్ధత వెరసి ఆయనకు తెలుగు, కన్నడ సినీ చరిత్రలో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయనే ఏకాంబరేశ్వరరావు. నిర్మించింది దశ చిత్రాలే అయినా దశాబ్దాల కాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలకు ప్రేమ పెళ్లి చేసింది కూడా ఏకాంబరేశ్వరరావే. ఆయన మనోగతం ఏంటో ఆయన మాటల్లోనే ... తమిళ సినిమా: మాది ఆంధ్రప్రదేశ్, బాపట్ల సమీపంలోని జమ్మిలపాలెం. పువ్వాడ బసవయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1934 సెప్టెంబర్ 27న పుట్టాను. మచిలీపట్టణంలో డిగ్రీ పట్టా పొందాను. ఆ తరువాత ఎస్ఐగా పరీక్షలో సెలెక్ట్ అయినా చేరలేదు. కాంట్రాక్టర్ వృత్తి చేపట్టాను. తరువాత చిత్ర రంగంపై దృష్టి మళ్లింది. చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి. పలు నాటకాలు ఆడాను కూడా. అప్పట్లో నా మిత్రుడు కొన ప్రభాకర్, హీరోగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో చెన్నైకి పయనం అయ్యాను. అక్కడ లోటుపాట్లను ఆరు నెలలు సునితంగా పరిశీలించాను. తొలి ప్రయత్నంగా పంపిణీ రంగంలోకి ప్రవేశించాను. మిత్రులు ఎన్ ఎన్భట్, ఎన్ ఎస్ మూర్తిలతో కలిసి భీమాంజనేయ యుద్ధం, సత్యమే జయం చిత్రాలను పంపిణీ చేశాను. ఆ తరువాత తానే చిత్రం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే నిర్మాతనయ్యాను. ఎన్ఎన్ భట్‌తో కలిసి విజయాభట్ మూవీస్ పతాకంపై 'సుఖ దుఃఖాలు' చిత్రం నిర్మించాను. తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ చిత్రానికిది రీమేక్. ఎస్.వి.రంగారావు గారు ప్రధానపాత్ర పోషించారు. నేటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత హీరోయిన్. అప్పటి వరకు హాస్యపాత్రలు పోషిస్తున్న వాణిశ్రీని రెండో హీరోయిన్గా పరిచయం చేశాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఇది మల్లెల వేళయని పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. నాలుగు లక్షలతో నిర్మించిన ఈ చిత్రాన్ని 1967లో విడుదల చేశాం. ఇదే చిత్రంలోని మేడంటే మేడే కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పాటలోనే గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ప్రాచుర్యం పొందారు. ఇక నేను కాంట్రాక్టర్‌గా సంపాదించిన రూ.30వేలతో పరిశ్రమలో అడుగుపెట్టాను. వాటిలో సగం తొలి చిత్ర నిర్మాణానికి ఖర్చు కాగా ఇక 15వేలు మిగిలాయి. తన బంధువు సునీల్‌చౌదరి రూ.15 వేలు పెట్టుబడి పెడుతానన్నారు. తరువాత కె.రాఘవ కూడా పార్టనర్‌గా చేరారు. ఎన్.వి.సుబ్బరాజు మరో భాగస్వామిగా చేరడంతో మొత్తం రూ.51వేలతో జగత్ కిలాడీలు చిత్రం మొదలెట్టాం. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్, సంభాషణలు రాశారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే కృష్ణ, విజయనిర్మలు ప్రేమలో పడ్డారు. కృష్ణగారి కుటుంబం వీరి ప్రేమను అంగీకరించ లేదు. కృష్ణ, విజయనిర్మలను వదిలి ఉండలేని పరిస్థితి రావడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నేను కె.రాఘవ పూనుకుని తిరుపతిలో వారి పెళ్లి చేయించాం. జగత్ కిలాడీలు మంచి విజయం సాధించింది. తదుపరి జగత్ జట్టీలు చిత్రం నిర్మాణానికి సిద్ధం అయ్యాం. ఈ చిత్రంలోను కృష్ణనే హీరోగా నటించమని అడిగాం. అందుకాయన హీరోయిన్గా విజయనిర్మలను చూపించారు. ఈ విషయంలో విభేదాలొచ్చాయి. దీంతో శోభన్‌బాబును ఎంపిక చేశాం. కేవీ నందనరావు దర్శకుడు. ఆయన వద్ద దాసరి నారాయణరావు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. జగత్‌జెట్టీలు పేరుతో విజయ బాపినీడు ఒక నవలనురాశారని తెలిసి ఆయన్ని పిలిచి మా చిత్రానికి పని చేయమని అడిగాం. అందుకాయన సంతోషంగా అంగీకరించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్. అప్పటి వరకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రావుగోపాలరావు గారిని ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం చేశాను. అందుకాయన శోభన్‌బాబు చిత్రంలో నేను సెకండ్ హీరోనా అంటూ నిరాకరించడంతో ఆ వేషం నేనే ధరించాను. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా నిర్మాతగా బాగానే ఉన్నాను కదా అని నటనపై ఆసక్తి చూపలేదు. మూడవ చిత్రం జగత్జంత్రీలు చేశాం. ఈ చిత్రం తరువాత విభేదాల కారణంగా రాఘవ, నేను విడిపోయాం. ఆ తరువాత నేను పల్గుణ పిక్చర్స్ పతాకంపై ఎస్.వి.రంగారావు, చలం, వాణిశ్రీలతో రాముడే దేవుడు చిత్రం చేశాను. బి.వి.ప్రసాద్ దర్శకుడు. కన్నడ చిత్ర రంగ ప్రవేశం మధ్యలో భట్‌తో కలిసి అతై కొందుకల శశికందుకల అనే చిత్రం చేశాను. కల్యాణ్‌కుమార్ హీరో. ఆ అనుభవంతో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ హీరోగా మూరువరె వజ్ర అనే భారీ పౌరాణిక చిత్రం చేశాను ఈ చిత్రంలో రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో నారద వినోదం పేరుతో అనువాదం చేశాను. దాసరిగారితో అత్యం త సాన్నిహిత్యం ఉన్నా ఆయనతో చిత్రం చేయలేకపోయాను. తెలుగులో గమ్మత్తు గూఢచారి పేరుతో బాలల ప్రధాన ఇతివృత్తంతో ఒక చిత్రం చేశాను. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆ తరువాత పంపిణీదారుల వ్యవస్థ పోయి కొనుగోలుదారుల పద్ధతి రావడంతో 1983 తరువాత చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నాను. నా జీవిత భాగస్వామి అనురేశ్వరి. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు సుందర్. సినీరంగంలో కొనసాగుతున్నాడు. రెండో కొడుకు చంద్రబాబు హైదరాబాదులోనే ఫిలిం ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. మూడవ కొడుకు సాప్టువేర్ ఇంజనీర్, స్టేట్స్లో ఉంటున్నారు. కూతురు హేమలత పెళ్లి చేసుకుని బాపట్లలో ఉంటోంది. 80 వసంతాలు పూర్తి చేసుకున్న నేను ఇప్పటికీ ఆనందంగా గడిపేస్తున్నాను. -
రూ.1.50 కోట్ల చెక్ అందజేసిన కృష్ణ
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు సినిమా నటుడు ఘట్టమనేని కృష్ణ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటి 50 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ రోజు కృష్ణ-విజయనిర్మల దంపతులు సీఎంను కలిశారు. తమ అల్లుడు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ వారి ఫ్యాక్టరీ తరపున కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ కోటి రూపాయలు కాకుండా ఎంపి నిధుల నుంచి మరో లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు చెప్పారు. తమ కుటుంబం తరపున 50 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. మహేష్ బాబు 25 లక్షలు, విజయనిర్మల 10 లక్షలు, తాను 15 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సంతోషించినట్లు తెలిపారు. మహేష్ బాబు హాంకాంగ్ షూటింగ్లో ఉన్నందున రాలేకపోయినట్లు తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చెప్పారు. విశాఖ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తుపాను బాధితులకు తన సానుభూతి తెలిపారు. ** -
స.హ.చట్టం అమలు తప్పనిసరి
నూజివీడు : సమాచార హక్కుచట్టం అమలులో అధికారులు గిమ్మిక్కులు చేస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార కమిషనర్లు లాం తాంతియాకుమారి, ముత్తంశెట్టి విజయనిర్మల హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న సమాచార హక్కు చట్టం పనితీరును పర్యవేక్షించేందుకు శనివారం వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నూజివీడులోని ఆర్అండ్బీ అతిధి గృహంలో లాం తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచార హక్కుచట్టంపై ప్రజలలో గతంలో కంటే చైతన్యం పెరిగిందన్నారు. అవినీతిని అరికట్టడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ చట్టం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ చట్టం అమలు బాగా జరుగుతోందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో సైతం ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. దేవాదాయశాఖ, సహకారశాఖలు సైతం సమాచారహక్కుచట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ప్రజలే ప్రభువులనే విషయాన్ని గమనించాలన్నారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాం తాంతీయాకుమారిని ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎన్.రమేష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి విజయనిర్మల జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల సూచిం చారు. జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టీఐ చట్టంపై జరిగిన అవగాహనా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని బట్టబయలు చేయడంలో ఆర్టీఐ(2005)చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధమన్నారు. గ్రామపంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రజాధనంతో చేపట్టే పనుల వివరాలను కేవలం రూ.10ఫీజుతో అర్జీపెట్టి తెలుసుకోవచ్చని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు రుసుము అవసరం లేదని తెలిపా రు. అర్జీ ఇచ్చిన 30రోజుల తర్వాత సమాధానం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారిని సంప్రదించాలని, అప్పటికీ సమస్య పరిష్కా రం కాకపోతే రోజుకు రూ.250 చొప్పున రూ.25వేల వరకు సంబంధిత అధికారులకు జరిమానా విధించవచ్చన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదవర్గాలకు 5శాతం మెడికల్ రాయితీ కల్పించాలని, ప్రస్తుతం ఎన్ని ఆస్పత్రులు ఆ విధానాన్ని పాటిస్తున్నాయో ఆర్టీఐ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. కళాశాల డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ఆర్ఐ బేబీసరోజిని ఎస్ఐ లక్ష్మీనారాయణ, వీఆర్వో లలితకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైద్య పరీక్షల ఫీజు వివరాలు ప్రదర్శించాల్సిందే
ఆర్టీఐ కమిషనర్ ఎం.విజయనిర్మల విజయవాడ : రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన ఫీజుల వివరాలను తప్పకుండా ప్రదర్శించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎం.విజయనిర్మల సూచించారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అమలుతీరు, చట్టం ద్వారా పరిష్కరించిన సమస్యలు, ఇతర అంశాలపై వివరించారు. సెక్షన్ 4(1)బికి సంబంధించి సమాచారాన్ని అన్ని కార్యాలయాలు తెలుగులోనే ప్రదర్శించాలన్నారు. దరఖాస్తుదారుని కోరిక మేరకు అంగ్లంలో ఉన్న తక్కువ పేజీల సమాచారాన్ని తెలుగులోకి అనువదించి అందజేయాల్సి ఉందని చెప్పారు. ఆరోగ్యశాఖకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయన్నారు. 63 వేలకు పైగా దరఖాస్తులు.. రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, వారి పరిధిలోని ఎనిమిది మంది కమిషనర్లకు 2005 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థనలు, ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించి 63,018 దరఖాస్తులు అందగా, వాటిలో ఈ నెల 18వ తేదీ నాటికి 49,932 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన 13,086 దరఖాస్తుల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తామన్నారు. తన పరిధిలోని వ్యవసాయం, ఆరోగ్యం, కో-ఆపరేటివ్, అటవీ, మార్కెటింగ్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి 13 జిల్లాల అభ్యర్థనలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు వారంలో మూడు రోజులు విజయవాడలోనే ఉంటానని ఆమె తెలిపారు. -
నవీన్ విజయకృష్ణ హీరోగా మూవీ లాంచ్
-
హీరోగా...నరేశ్ తనయుడి తెరంగేట్రం
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా మారారు. ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. అడ్డాల చంటి, గవర పార్థసారథి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ రగుతు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు కలిసి కెమెరా స్విచాన్ చేయగా, కృష్ణ, మహేశ్‌బాబు కలిసి క్లాప్ ఇచ్చారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. హీరో నవీన్ విజయకృష్ణ నాయనమ్మ, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ముహూర్తపు దృశ్యానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘మా కుటుంబం నుంచి నవీన్ రూపంలో మరో హీరో ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉంది. నవీన్ మంచి ప్రతిభాశాలి. తనలో మంచి ఎడిటర్ కూడా ఉన్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడని నా నమ్మకం’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ -‘‘మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతుంటే ఏదో తెలీని ఆనందం కలుగుతోంది. నా చిన్నతనంలోనే ‘పండంటికాపురం’లో బాలనటునిగా నటించాను. 17 ఏళ్ల ప్రాయంలో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను. మూడు దశాబ్దాల నట ప్రస్థానం నాది. ఇప్పుడు నా కుమారుడు నా వారసుడిగా రావడం గర్వంగా ఉంది. ప్రముఖ నటి మేనక కుమార్తె కీర్తి ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడని నా నమ్మకం’’ అని చెప్పారు. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతిసాగర్, కూర్పు: త్యాగరాజన్. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్
హైదరాబాద్: హోమియోపతి వైద్య సేవలను, దాని ప్రాముఖ్యతను ఈ తరానికి అందజేస్తున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంస్థ- ఈ దిశలో మరో ముందడుగు వేసింది. తాజాగా హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. కుటుంబంలోని సభ్యులందరూ ఆరోగ్యంగా, హాయిగా జీవించాలనే ప్రధాన సంకల్పంతో ఈ ఆఫర్‌ను సంస్థ ప్రారంభించింది. 90 రోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్, మెడిసిన్స్‌పై 30-40 శ్రేణిలో డిస్కౌంట్ ఈ ఆఫర్ ద్వారా లభిస్తాయి. ఈ ఆఫర్‌కు సంబంధించిన లోగోను శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ సినీనటులు కృష్ణ, విజయనిర్మల, సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీకాంత్ ముర్లవార్ ఆవిష్కరించారు. సుధీర్‌బాబు, నరేష్, లిటిల్ సూపర్‌స్టార్ గౌతమ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లాదిమందికి ప్రపంచస్థాయి హోమియోపతి వైద్య సేవలను తమ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా శ్రీకాంత్ ముర్లవార్ పేర్కొన్నారు.