
ఇది యూత్ కల్చర్!
తరాలు మారే కొద్దీ యువతరంలో వస్తున్న మార్పులు, కట్టుబాట్లను కాదని ప్రవరిస్తున్న తీరు, ప్రతి పనిలోనూ వారి ఆలోచనా విధానం ఎలా ఉందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం - ‘కల్చర్’. షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
పి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.ఎస్.పి ఆనంద్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల క్లాప్ ఇచ్చారు. యూత్‌కు నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.