ఆన్లైన్లో శ్రీశ్రీ
ఈస్ట్‌మన్ కలర్‌లో రూపొందిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘తేనె మనసులు’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ , ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’తో తెలుగు తెరకు తొలి కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేశారు. తెలుగు మొదటి సినిమా స్కోప్ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎమ్‌ఎమ్ చిత్రం ‘రాజ సింహాసనం’... ఇలా తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారాయన. తాజాగా ‘శ్రీశ్రీ’తో ఈ సూపర్ స్టార్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని తొలిసారిగా విదేశాల్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కృష్ణ, విజయనిర్మల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై బాలురెడ్డి, షేక్‌సిరాజ్ నిర్మించారు. ‘‘ ‘శ్రీశ్రీ’ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఇంట్లోనే కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అని కృష్ణ అన్నారు. ఎమ్‌ఫ్లిక్స్ అధినేత రాజు నడింపల్లి మాట్లాడుతూ -‘‘కృష్ణగారు నటించిన ‘శ్రీశ్రీ’తో మా ఠీఠీఠీ.ఝజజ్ఠీఠీౌటఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రం కాబట్టి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘కృష్ణగారిపై ఉన్న ప్రేమతో ‘శ్రీ శ్రీ’ సినిమా రూపొందించాను’’ అని దర్శకుడు చెప్పారు.