sree sree
-
నూరు పుస్తకాలు వెయ్యి రూపాయలు
సాక్షి, అమరావతి బ్యూరో: ‘కదిలేది కదిలించేది.. పెనునిద్దుర వదిలించేది.. మునుముందుకు నడిపించేది.. పరిపూర్ణ బ్రతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి’ అన్న శ్రీశ్రీ ఆధునిక సాహిత్యంలో చెదరని ముద్ర వేశారు. 20వ శతాబ్ధపు కవిగా కీర్తింపబడ్డ శ్రీశ్రీ సాహిత్యాన్ని భావితరాలకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఓ శ్రీశ్రీ వీరాభిమాని. ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి శ్రీశ్రీ రాసింది, చెప్పింది, శ్రీశ్రీపై ఇతరులు రాసింది, చెప్పింది పొల్లుపోకుండా నిక్షిప్తం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు రచయిత సింగంపల్లి అశోక్‌కుమార్. విజయవాడ పుస్తక మహోత్సవంలో షాప్ నెంబర్ 112లో శ్రీశ్రీ సాహిత్య నిధి పేరిట ప్రత్యేకంగా ఏర్పాటుచేసి శ్రీశ్రీ సాహిత్య సేవ చేస్తూ ఆయన ఆనందం పొందుతున్నారు. నూరు పుస్తకాలు వెయ్యి రూపాయలు శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ఇలా వంద పుస్తకాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ‘నూరు పుస్తకాల హోరు’ అనే పేరుతో రూ. 6 వేల విలువ చేసే పుస్తకాలను కేవలం వెయ్యి రూపాయలకే పంపిణీ చేస్తున్నారు. 2008లో ప్రారంభించిన సాహితీ ఉద్యమంలో అశోక్‌కుమార్ విజయవంతమయ్యారు. నూరు పుస్తకాల హోరులో ప్రతి మూడు నెలలకు శ్రీశ్రీ సాహిత్యంపై నాలుగు పుస్తకాలను సంస్థ ప్రచురిస్తోంది. వెయ్యి రూపాయలు చందాగా కట్టిన వారికి ప్రచురించిన ప్రతి పుస్తకాన్ని అందజేస్తారు. ఇప్పటి వరకు 90 పుస్తకాలను సాహిత్య నిధి ప్రచురించి శ్రీశ్రీ అభిమానుల దాహార్తిని తీర్చింది. కవినీ, కమ్యూనిస్టునూ చేసింది శ్రీశ్రీ నన్ను కవిని, కమ్యూనిస్టుని, మానవతావాదిని చేసింది శ్రీశ్రీయే అని శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్‌కుమార్ అన్నారు. ఆయన స్పూర్తితో ఇప్పటి వరకు 18 పుస్తకాలను, ఎన్నో కవితలను రచించానని చెప్పారు. ఎనిమిదేళ్లుగా బుక్ ఫెస్టివల్లో స్టాల్‌ను నిర్వహిస్తున్నా..శ్రీశ్రీ సాహిత్యానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, తగ్గబోదని ఆయన స్పష్టంచేశారు. -
ఆన్లైన్లో శ్రీశ్రీ
ఈస్ట్‌మన్ కలర్లో రూపొందిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘తేనె మనసులు’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ , ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’తో తెలుగు తెరకు తొలి కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేశారు. తెలుగు మొదటి సినిమా స్కోప్ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎమ్ఎమ్ చిత్రం ‘రాజ సింహాసనం’... ఇలా తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారాయన. తాజాగా ‘శ్రీశ్రీ’తో ఈ సూపర్ స్టార్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా విదేశాల్లో ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కృష్ణ, విజయనిర్మల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై బాలురెడ్డి, షేక్సిరాజ్ నిర్మించారు. ‘‘ ‘శ్రీశ్రీ’ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఇంట్లోనే కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అని కృష్ణ అన్నారు. ఎమ్ఫ్లిక్స్ అధినేత రాజు నడింపల్లి మాట్లాడుతూ -‘‘కృష్ణగారు నటించిన ‘శ్రీశ్రీ’తో మా ఠీఠీఠీ.ఝజజ్ఠీఠీౌటఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రం కాబట్టి ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘కృష్ణగారిపై ఉన్న ప్రేమతో ‘శ్రీ శ్రీ’ సినిమా రూపొందించాను’’ అని దర్శకుడు చెప్పారు. -
శ్రీ శ్రీ 'బర్త్‌డే' స్పెషల్ స్టోరి
-
శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ
మహాకవి శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాదని ఎలుగెత్తి మరీ ప్రకటించిన సాహితీభానుడు.. కవితాగ్నిహోత్రుడు! రెండు శ్రీలు ధరించిన ఈ మహాప్రస్థానయోథుడు తరతరాలుగా తెలుగువారిలో చైతన్యకాంతులు నింపగల స్ఫూర్తివంతుడు. తన ఒక్కో కవితను విప్లవ కేతనంగా మార్చి, ఒక్కో పాటను సాహిత్యపు పూతోటగా తీర్చి, ఒక్కో మాటతో తెలుగుతల్లికి ముత్యాల సరం కూర్చిన శ్రీశ్రీ ఎందరికో నిత్యం స్మరణకు వచ్చే అనితరసాధ్యుడు. ఇలా శ్రీశ్రీ ద్వారా ఉత్తేజితమైన వారెందరిలోనే తానూ ఒకడినని అంటున్నారు సినిమా డెరైక్టర్ నల్లపూసలు బాబ్జీ. ఆయన ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు వేడుకకు వెళ్లినా ఇచ్చే గిఫ్ట్... శ్రీశ్రీ మహాప్రస్థానం మహాకవి స్ఫూర్తితో సామాజిక సమస్యలపై ఆయన కొన్ని వందల పాటలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు సహా 39 అవార్డులు దక్కించుకున్న నల్లపూసలు వంటి సామాజిక నేపథ్య సినిమాను తొలి ప్రయత్నంలోనే తీసి ఉత్తమ దర్శకుడనిపించుకున్నారు. సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా తీస్తున్న వేటకొడవళ్లు షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన ఆయనతో సిటీప్లస్ తో మాట్లాడారు. మహాకవి శ్రీశ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం. శ్రీశ్రీ నడయాడిన నేల అనేగాకుండా ఆయనకు రోజుకోవిధంగా కనిపించి మెప్పించిన విశాఖ అన్నా అంతే ఇష్టం. ఈ నేలపై సాహిత్య సౌరభాలు విరబూశాయి. ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన విశాఖ, ఉత్తరాంధ్ర అంటే నాకెంతో మక్కువ. అందుకే వైజాగ్‌కు రాకముందే ఈ ప్రాంతానికి అభిమాని అయిపోయాను. శ్రీశ్రీ స్ఫూర్తి మాది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు. తాత, నాన్న కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. నేను స్కూల్లో ఉన్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదవమని నాన్న చెబుతుండేవారు. తొలుత అందులో భావం నాకు అర్థంగాకపోయినా తర్వాతర్వాత చదువుతున్న కొద్దీ ఏదో ఉత్తేజం నన్ను కదిలించేది. చుట్టూ ఉన్న సమస్యలపై నేనూ స్పందించేవాణ్ణి. క్రమంగా పార్టీ బాట పట్టా. అప్పట్లో నాతోపాటు చాలా మంది చేతుల్లో మహాప్రస్థానం కనిపించేది. ఆ స్ఫూర్తితో నేనూ పాటలు రాశాను. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐలో కీలక బాధ్యతలు వహిస్తూనే ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజానాట్యమండలిలో చేరా. నేను రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి. మహాప్రస్థానం అద్వితీయం నన్ను నేను తీర్చిదిద్దుకోవడంలో మహాప్రస్థానం పాత్ర కీలకం. అందుకే ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు ఫంక్షన్ అయినా దీన్నే బహుమతిగా ఇస్తా. ఇలా ఇప్పటివరకు ఐదు వేల పుస్తకాలు పంచా. వారు అప్పుడుకాకపోయినా తర్వాత ఏదో ఒక సందర్భంలో మహాప్రస్థానం చదువుతారు. ఆ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కదిలిస్తుంది. మార్పు తెస్తుంది. సమాజం కోసం చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. మాదాల రంగారావు సిన్మాలు అప్పట్లో నన్ను చాలా ప్రభావితం చేశాయి. దీంతో స్వీయ దర్శకత్వంలో 1997లో నల్లపూసలు సినిమా తీశా. ఈ చిత్రం నంది సహా 39 అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నూతన దర్శకుడిగా బంగారు నంది అందుకున్నా. భరతముని సహా నాలుగు అవార్డులు, మహానటి సావిత్రి అవార్డు వంటివన్నీ వచ్చాయి. దీంతో నల్లపూసల బాబ్జీగా నా పేరు స్థిరపడిపోయింది. 2000 సంవత్సరంలో ఎన్టీఆర్నగర్ సినిమా తీశా. దక్షిణభారతదేశంలోని ప్రముఖ హీరోల డూప్‌లనే హీరోలుగా చేసి తీసిన తొలి సినిమా ఇదే. దీనికి 18 అవార్డులు వచ్చాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న డూప్‌లు చాలామందికి ఉపాధి దొరికింది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తిఅయింది. మే నెలలో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం వేటకొడవళ్లు సినిమా షూటింగ్ వైజాగ్‌లో చేస్తున్నాం. వైజాగ్ వాళ్లకు చాన్స్ ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌పైనే కాదు తోటివారిపైనా కాస్త ప్రేమ చూపండనే కాన్సెప్ట్‌తో వేటకొడవళ్లు సినిమా తీస్తున్నాం. దీనిలో సగం మంది విశాఖకు చెందినవారే నటిస్తున్నారు. హీరోలు ఐదుగురు కొత్తవారే. కనిపారేస్తున్నవారే చెత్తకుండీల్లో, రైల్వే స్టేషన్ల్లో అష్టకష్టాల మధ్య పెరిగి యాదృచ్ఛికంగా సంఘ విద్రోహశక్తులుగా ఎలా మారిపోతున్నారో ఈ సినిమాలో చూపిస్తున్నాం.