స్క్రీన్‌ టెస్ట్‌ | some cinema gk questions | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Mon, May 8 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

స్క్రీన్‌ టెస్ట్‌

స్క్రీన్‌ టెస్ట్‌

రజనీకాంత్‌ నటించిన ఏ సినిమాకి విజయనిర్మల దర్శకత్వం వహించారు?
ఎ) రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌
బి) దేవుడే గెలిచాడు
సి) అంతం కాదిది ఆరంభం
డి) ముఖ్యమంత్రి

అఖిల్‌ పాత్ర పేరుతో నాగార్జున ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) మనం,
బి) మాస్,
సి) సూపర్‌
డి) భాయ్‌

చిరంజీవి పక్కన ఎక్కువ సినిమాల్లో నటించింది రాధిక. ఆ తర్వాతి స్థానం ఏ హీరోయిన్‌ది?
ఎ) విజయశాంతి
బి) రాధ
సి) భానుప్రియ
డి) సుమలత

ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాణ సంస్థ ఏది?
ఎ) అన్నపూర్ణ స్టూడియోస్‌
బి) వైజయంతి మూవీస్‌
సి) గీతా ఆర్ట్స్‌
డి) సురేశ్‌ ప్రొడక్షన్స్‌

వెంకటేశ్‌ ఓ సినిమాలో నాలుక కోసుకుంటారు... ఆ సినిమాలో హీరోయిన్‌ ఎవరు?
ఎ) కరీనా కపూర్‌
బి) ప్రీతీ జింతా
సి) అమీషా పటేల్‌
డి) ట్వింకిల్‌ ఖన్నా

సౌందర్య అసలు పేరు?
ఎ) రమ్య
బి) సౌమ్య
సి) సాహిత్య
డి) లాలిత్య

కృష్ణ నటించిన ఏ సినిమా చూసిన తర్వాత మహేశ్‌బాబు హీరో అవ్వాలని నిర్ణయించుకున్నారు?
ఎ) సింహాసనం
బి) అల్లూరి సీతారామరాజు
సి) గూఢచారి 116
డి) ఊరికి మొనగాడు

మెగా ఫ్యామిలీలో మంచి ఎత్తున్న హీరో వరుణ్‌ తేజ్‌. ఈ యువ హీరో హైట్‌ ఎంత?
ఎ) 6 అడుగుల 4 అంగుళాలు
బి) 6 అడుగుల 2 అంగుళాలు
సి) 6 అడుగుల 6 అంగుళాలు
డి) 6 అడుగుల 5 అంగుళాలు

పవన్‌ కల్యాణ్‌ తన ఫైట్స్‌ని తానే కంపోజ్‌ చేసుకున్న మొదటి చిత్రం?
ఎ) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
బి) గోకులంతో సీత
సి) తమ్ముడు
డి) జానీ

ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన అన్ని తెలుగు చిత్రాల్లోనూ కథానాయికగా విజయశాంతి నటించారు.. ఆయనెవరు?
ఎ) కోడి రామకృష్ణ
బి) కోదండ రామిరెడ్డి
సి) టి. కృష్ణ
డి) ముత్యాల సుబ్బయ్య

‘అరుంధతి’లోని ‘జేజెమ్మా... జేజెమ్మా..’ పాట పాడిన గాయకుడు ఎవరు?
ఎ) కె.జె. ఏసుదాస్‌
బి) ఖైలాష్‌ కేర్‌
సి) శంకర్‌ మహదేవన్‌
డి) హరిహరన్‌

‘ఈగ’ సినిమా మాటల రచయిత ఎవరో తెలుసా? ?
ఎ) యం. రత్నం
బి) జనార్థన మహర్షి
సి) సత్యానంద్‌
డి) విజయేంద్ర ప్రసాద్‌

రాజమౌళి దర్శకత్వం వహించిన 11 సినిమాల్లో ఛాయాగ్రాహకుడు కేకే సెంథిల్‌కుమార్‌ ఎన్ని సినిమాలకు పని చేశారు?
ఎ) 11, బి) 10
సి) 7, డి) 9

చిరంజీవి నటించిన ఏ సినిమాకి పవన్‌ కల్యాణ్‌ ఫైట్‌ కంపోజ్‌ చేశారు?
ఎ) శంకర్‌దాదా ఎంబీబీఎస్‌
బి) అందరివాడు
సి) డాడీ
డి) మాస్టర్‌

బాలనటిగా రాశి నటించిన మొదటి సినిమా ఏది?
ఎ) మమతల కోవెల
బి) రావుగారి ఇల్లు
సి) బాల గోపాలుడు
డి) ఆదిత్య 369

వెంకటేశ్‌ ఎత్తుకున్న ఈ బుడతడు ఇప్పుడు హీరో.. అతనెవరు?
ఎ) నాగచైతన్య
బి) అఖిల్‌
సి) రానా
డి) సుశాంత్‌

ప్రభాస్‌తో ప్రస్తుతం ‘సాహో’ సినిమా చేస్తున్న దర్శకుడి మొదటి సినిమా ఏది?
ఎ) ఎక్స్‌ప్రెస్‌ రాజా
బి) రన్‌ రాజా రన్‌
సి) జిల్‌
డి) వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌


ఈ ఫొటో ఏ సినిమాలోనిది?
ఎ) శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం
బి) పాండురంగ మహత్మ్యం
సి) నర్తనశాల
డి) జగదేకవీరుని కథ

బావలు సయ్యా.. మరదలు సయ్యా.. అనే సిల్క్‌ స్మిత ఫేమస్‌ సాంగ్‌ ఏ సినిమాలోనిది?
ఎ) రుస్తుం
బి) బావా బావమరిది
సి) ఆదిత్య 369
డి) ఖైదీ నం. 786

ఇలియానాతో మహేశ్‌బాబు ‘క్యారియర్లు క్యారియర్లు..’ అనే డైలాగ్‌ చెప్పేటప్పుడు ఓ అల్పాహారం పేరు వస్తుంది.. ఆ టిఫిన్‌ ఏంటి?
ఎ) దోసె,  బి) ఇడ్లీ
సి) వడ,  డి) ఉప్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement