
ఇటీవలే మంత్ ఆఫ్ మధు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ బర్త్ డే జరుకుంటున్న మంజుల తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది తండ్రితో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.
ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ..' ప్రతి పుట్టిన రోజుకు మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. తొలిసారి ఆయన లేకుండా నా బర్త్ డే జరుగుతోంది. ఈ ఫోటోల్లోని క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నాన్నతో ఉన్న ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి.' అంటూ ఎమోషనలైంది. ఈ ఫోటోల్లో కృష్ణతో పాటు మహేశ్ బాబు, నమ్రత, ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు.
కాగా.. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేశ్ బ్రదర్ రమేష్ బాబు, ఇందిరమ్మ కూడా గతేడాదిలోనే కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment