Special Interview With My Super Star Nanna Promo: సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టిన తొలి హీరో. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ప్రస్తుతం ఆయన వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు. కనీసం బయట కాలు కూడా పెట్టకుండ ఇంటికే పరిమితం అయ్యారు.
చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే తప్పా ఆయన మీడియా ముందుకు రారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో కృష్ణ బర్త్‌డే రానుంది. మే 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. కాగా మంజులకు సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పెషల్ ఇంటర్య్వూ విత్ మై సూపర్‌స్టార్ నాన్న పేరుతో తండ్రిని ఇంటర్య్వూ చేసింది. తాజాగా ఈ స్పెషల్ ఇంటర్య్వూకు సంబంధించిన ప్రోమోను ఆమె రిలీజ్ చేసింది. ఇందులో మంజుల.. కృష్ణ హీరో ఎలా అయ్యారు, ఆయన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, మహేశ్‌ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికర విషయాలపై తండ్రితో చర్చించింది.
చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్?
ఈ క్రమంలో మహేశ్‌ను చిన్నప్పడే సూపర్ స్టార్ చేశారు.. ఇది ప్లాన్డ్‌గా జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అని అడగ్గా.. ఇది అనుకొకుండ జరిగిందని ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఓ రోజు షూటింగ్ చూస్తానని స్టూడియోకు వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి చూస్తు అలా నిలబడ్డాడు. దగ్గరి పిలిచి ఒకసారి యాక్ట్ చేయమని అడిగితే లేదు నేను చేయను చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు’ అంటూ కృష్ణ చెబుతూ మురిసిపోయారు. అనంతరం మహేశ్‌తో కలిసి పోకిరి,దూకుడు చూశానని, అవి రెండు సినిమాలు లాండ్ మార్క్ అయ్యాయని’ కృష్ణ అన్నారు. ఇలా తనయుడు మహేశ్ బాబు గురించి, తన గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలపై చర్చించిన కృష్ణ పూర్తి ఇంటర్య్వూ చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment