కృష్ణాలో పెరిగిన వరద ఉధృతి
వారంలోగా శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద తీవ్రత మళ్లీ పుంజుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం నాటికి 45 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా, నిల్వలు 95.22 టీఎంసీలకు చేరుకున్నాయి. జల విద్యుదుత్పత్తి ద్వారా ఆల్మట్టి నుంచి 9,730 క్యూసెక్కులను దిగువన నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
వర్షాలు, వరదలు కొనసాగితే ఒకటీ రెండురోజుల్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేసే అవకాశముంది. దీనికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.72 టీఎంసీలున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ గేట్లను ఎత్తే అవకాశముంది.
దీంతో తెలంగాణలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. ఎందుకంటే జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుంగభద్ర బేసిన్‌లోనూ వర్షాలు
కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లోనూ వర్షా లు కురుస్తుడడంతో తుంగభద్రకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర æద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment