
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ ఏడాదిలో మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరిలో మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు.
(చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!)
అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి ఇందిరాదేవి దూరం అయింది. సెప్టెంబర్ 28న కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి మరణించింది. కన్న తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడే మరచిపోతున్న తరుణంలో కన్న తండ్రి కన్నుమూయడం.. మహేశ్‌ని మరింత విషాదంలోకి నెట్టింది.