![Doctors update On Senior Actor Superstar Krishna Health - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/14/doctor3.jpg.webp?itok=hQiVpH6O)
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆయన పరిస్థితిపై ఇప్పుడేం ఏం మాట్లాడాలేమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయినట్లు డాక్టర్ గురునాథ్ రెడ్డి తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఉదయం నుంచి ఇప్పటివరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి వారి కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేయవద్దని కోరారు.
(చదవండి: అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు)
ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్‌లో చాలా వరకు ఎఫెక్ట్ అయినట్లు వెల్లడించారు. మా దగ్గర అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లిన ఇంతకు మించి ఏమి చేయలేమని స్పష్టం చేశారు. ఆయన మా ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఆయనకు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment