
సూపర్ స్టార్ కృష్ణ(79) మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.
ఇక, సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు అర్పించారు. అనంతరం, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన వ్యక్తి. సాహసాలు, సంచనాలకు కేరాఫ్ అడ్రస్. అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ. ఆయన లేరు అంటే ఎవరూ కూడా జీర్ణించుకోని పరిస్థితి.
సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ లేకపోవడం తీరని పెద్దలోటు. నా చిన్నతనం నుంచి నేను కృష్ణకు అభిమానిని. ఆయన సొంత బ్యానర్‌లో నేను సినిమా చేయడం నా అదృష్టం. కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇది కృష్ణను చూసి నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.