ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది : సుధీర్‌ బాబు | Sudheer Babu Talk About Aa Ammayi Gurinchi Meeku Cheppali | Sakshi
Sakshi News home page

ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది : సుధీర్‌ బాబు

Published Sun, Sep 18 2022 10:48 AM | Last Updated on Sun, Sep 18 2022 10:48 AM

Sudheer Babu Talk About Aa Ammayi Gurinchi Meeku Cheppali - Sakshi

హీరో సుధీర్‌ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో మైత్రీమూవీ మేకర్స్‌తో కలిసి బి. మహేంద్రబాబు, కిరణ్‌ బళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి గొప్ప సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. తండ్రీకూతుళ్లు కలిసి ఈ సినిమాకు వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాం’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు ఓ కొత్త కోణాన్ని ప్రజెంట్‌ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘ఇది నాకు స్పెషల్‌ మూవీ’’ అన్నారు కృతీ శెట్టి .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement