
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నారు

సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో సుధీర్ వివాహం అయింది.

తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పెళ్లి సాంగ్‌కు అప్పటి ఫోటోలను ఆయన జతచేశారు.

సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

పెళ్లి వేడుకలో కృష్ణ, నాగేశ్వర రావు, వెంకటేశ్, చిరంజీవి, జయసుద, జయప్రద, అల్లు అరవింద్ వంటి స్టార్స్ ఉన్నారు.

సుధీర్ బాబు గతంలో కూడా పెళ్లిరోజు సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని పెళ్లి చూపులు నాటి ఫోటోను పంచుకున్నారు.

సుధీర్ బాబు వాస్తవంగా ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. కానీ సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు.

సినిమా రంగంలోకి రాకముందు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక బ్యాడ్మింటన్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో సుధీర్ ఉండేవారు.

అతను పుల్లెల గోపీచంద్‌తో కలిసి డబుల్స్ (రాష్ట్రస్థాయి) భాగస్వామిగా ఆడాడు.

2010లో మంజుల ఘట్టమనేని నిర్మించిన 'ఏ మాయ చేసావే' చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు.

'ప్రేమ కథా చిత్రమ్'తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు.

'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో అక్టోబర్ 11న దసరాకు రానున్నాడు.