'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్! | Sudheer Babu Maama Mascheendra Trailer Released Today | Sakshi
Sakshi News home page

Sudheer Babu: 'నా కూతుళ్లే వాళ్ల వెంట పడ్డారంట'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Wed, Sep 27 2023 4:21 PM | Last Updated on Wed, Sep 27 2023 4:22 PM

Sudheer Babu Maama Mascheendra Trailer Released Today - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు,  ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న చిత్రం మామ మశ్చీంద్ర. ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.  శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సుధీర్ బాబు డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?)

ట్రైలర్ చూస్తే.. 'ఈ సృష్టింలో నువ్వొక్కడివే నిజం.. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు' అనే డైలాగ్‌లో మొదలైంది. ట్రైలర్‌లో గమనిస్తే సుధీర్‌ డబుల్‌ రోల్‌తో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్‌లో సుధీర్‌ బాబు ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మీర్నాలిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement