సుదీర్‌బాబు పునరాగమనం | Sudheer Babu back as Rachakonda CP | Sakshi
Sakshi News home page

సుదీర్‌బాబు పునరాగమనం

Published Thu, Jul 11 2024 7:56 AM | Last Updated on Thu, Jul 11 2024 7:56 AM

Sudheer Babu back as Rachakonda CP

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్షన్‌ కోడ్‌తో బదిలీ 

    సీఏఆర్‌ సహా సిటీలోని రెండు జోన్లకు కొత్త డీసీపీలు  

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ ఎఫెక్ట్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ అయిన రాచకొండ పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తిరిగి అదే స్థానానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఆయనను మల్టీ జోన్‌–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్‌ జోషిని రాచకొండ సీపీగా తీసుకువచి్చంది. తాజా బదిలీల్లో తరుణ్‌ జోషి ఏసీబీ డైరెక్టర్‌గా వెళ్లారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాల జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్‌ 30ని గడువుగా తీసుకుని.. ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి.  

సుదీర్‌బాబు 2018 ఏప్రిల్‌ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్‌ చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడా ది డిసెంబర్‌ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పని చేసిన జాబితాలో సు«దీర్‌ బాబు ఉన్నారు. దీంతో ఆయ న్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్‌ జోషిని నియమించింది. తాజా బదిలీల్లో సు«దీర్‌ బాబును మళ్లీ రాచకొండ సీపీగా నియమించింది.  

గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సుధీర్‌బాబు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్‌ సీపీగానూ పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరానికి సంబంధించిన కొన్ని స్థానాల్లోనూ మార్పుచేర్పులు జరిగాయి. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న రక్షిత కె.మూర్తి డీసీపీ సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌ డీసీపీగా వచ్చారు. దీంతో నగరంలో పని చేస్తున్న మహిళా ఉన్నతాధికారుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో సౌత్‌ వెస్ట్‌ డీసీపీగా పని చేసి, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న బి.బాలస్వామి ఈస్ట్‌ జోన్‌గా రాగా.. రాచకొండ టాస్‌్కఫోర్స్‌ డీసీపీ జి.చంద్ర మోహన్‌ సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా వచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement