Rachakonda Commissioner
-
రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ
మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.బైండోవర్ అంటే ఏంటో తెలుసా?ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు. -
మంచు ఫ్యామిలీకి విధించిన షరతులు ఇవే!
-
రాచకొండ సీపీ నోటీసులు
-
హైదరాబాద్ ఓఆర్ఆర్పై డ్రంకెన్ డ్రైవ్‌లు.. ఇక అడుగడుగునా నిఘా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. నిర్భయ, ఐటీఎంఎస్, నేను సైతం కార్యక్రమాల కింద ఏర్పాటైన సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో రాచకొండలో అడుగడుగునా నిఘా ఉండనుంది. ఇప్పటికే కేంద్రం హోం శాఖకు చెందిన సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను పంపించామని కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. సుమారు 50 మంది సిబ్బంది 24/7 కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉంటారని, జోన్ల వారీగా ప్రత్యేక నిఘా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..ఔటర్లో డ్రంకెన్ డ్రైవ్‌లు.. పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుంది. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం (ఆప్ట్)ను ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, దర్యాప్తులతో పాటు సమాంతరంగా ప్రమాదం జరిగిన తీరు, కారణాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషించడం, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం దీని బాధ్యత. ఓఆర్ఆర్పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నాం.3 షిఫ్ట్‌లలో సిబ్బందికి విధులు.. సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బందికి మూడు షిఫ్ట్‌లను కేటాయించాం. దీంతో 74 పెట్రోలింగ్ వాహనాల సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తారు. తగినంత స్థాయిలో నియామకాలు జరిగిన తర్వాత పోలీసు స్టేషన్లలో కూడా మూడు షిఫ్ట్‌ల విధానాన్ని అమలు చేస్తాం.సైబర్ బాధితులకు ఊరట.. క్విక్ రెస్పాన్స్, విజుబుల్ పోలీసింగ్, సాంకేతికత.. ఈ మూడే రాచకొండ పోలీసుల ప్రాధాన్యం. దీంతోనే నేరాలు తగ్గడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 7 నెలల్లో రూ.15 కోట్ల సొమ్మును బాధితులకు రీఫండ్ చేశాం. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తే బాధితులకు ఊరట కలగడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.చదవండి: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా.. తల్లిదండ్రులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలుపోలీసు ప్రవర్తనపై నిఘా.. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు వంద బాడీవార్న్ కెమెరాలను కొనుగోలు చేశాం. కమిషనరేట్‌లోని 12 ఠాణాల్లోని ఎస్ఐ ర్యాంకు అధికారికి వీటిని ధరించి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ బాడీవార్న్ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతుంటుంది.మహిళల భద్రత కోసం.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2 నెలల్లో ఎల్బీనగర్, భువనగిరిలో భరోసా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిల్లో తగినంత మహిళా సిబ్బందితో పాటు శాశ్వత కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నాం. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఆయా విభాగాల్లో మహిళా సిబ్బందిని పెంచుతున్నాం. మహిళలను వేధింపులు పునరావృతమైతే ఆయా నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నాం. ఇందుకోసం ప్రతీ పోలీసు స్టేషన్లో రిజిస్ట్రీ ఉంటుంది. -
సుదీర్‌బాబు పునరాగమనం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ అయిన రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు తిరిగి అదే స్థానానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఆయనను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ సీపీగా తీసుకువచి్చంది. తాజా బదిలీల్లో తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్‌గా వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాల జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని.. ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. ⇒ సుదీర్‌బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడా ది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పని చేసిన జాబితాలో సు«దీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయ న్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని నియమించింది. తాజా బదిలీల్లో సు«దీర్ బాబును మళ్లీ రాచకొండ సీపీగా నియమించింది. ⇒ గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సుధీర్‌బాబు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరానికి సంబంధించిన కొన్ని స్థానాల్లోనూ మార్పుచేర్పులు జరిగాయి. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న రక్షిత కె.మూర్తి డీసీపీ సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా వచ్చారు. దీంతో నగరంలో పని చేస్తున్న మహిళా ఉన్నతాధికారుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో సౌత్ వెస్ట్ డీసీపీగా పని చేసి, ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న బి.బాలస్వామి ఈస్ట్ జోన్‌గా రాగా.. రాచకొండ టాస్‌్కఫోర్స్ డీసీపీ జి.చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా వచ్చారు. -
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగోల్ కాల్పుల బాధితులను పరామర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
-
HYD: పోలీసులే ఊహించని బిగ్ స్కామ్.. ఐడియా మామూలుగా లేదు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న డాక్టర్ సహా సిబ్బందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ నేరాలపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. ఫింగర్ ప్రింట్ స్కామ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు రిజక్ట్ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్, సిబ్బందిని అరెస్ట్ చేశాము. కాగా, శ్రీలంకలో మొదటి ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ జరిగింది. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఇది హ్యోమన్ స్మగ్లింగ్. ఒక్కో సర్జరీకి రూ.25వేలు తీసుకున్నారు. కేరళలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరికి ఫింగర్ ప్రింట్స్ ఆపరేషన్ జరిగింది. కువైట్‌లో ఉద్యోగాల కోసం ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నవాళ్లు కువైట్ వెళ్లారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో ఇంటి వచ్చే కొరియర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి: సీపీ సీవీ ఆనంద్ -
మహేశ్ భగవత్, దేవేందర్ సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందించిన 14 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ చుంగిలను రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌కు ఎంపిక చేసింది. మరో 12 మంది పోలీసు అధికారులకు మెరిటోరియస్ సర్వీస్ పతకాలను ప్రకటించింది. పోలీసు బలగాల్లో మంచి పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సేవా పతకాలను ప్రకటిస్తుంది. మెరిటోరియల్ మెడల్స్ పొందినది వీరే.. మెరిటోరియల్ మెడల్స్‌కు ఎంపికైనవారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధన విభాగం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూరాడ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, పోలీస్ అకాడమీలో డీఎస్పీగా ఉన్న గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సీఎస్బీ ఎస్సై చిప్ప రాజమౌళి, రాచకొండ ఎస్బీ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్, కామారెడ్డి హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ ఎస్సై జంగన్నగారి నీలంరెడ్డి, మామునూర్ బెటాలియన్ ఏఆర్ ఎస్సై సలేంద్ర సుధాకర్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ ఉన్నారు. మిగతా యూనిఫాం విభాగాల్లో.. • అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీస్)లో ఉత్తమ సేవలకు సంబంధించి తెలంగాణకు చెందిన ఇద్దరు మెడల్స్‌కు ఎంపికయ్యారు. లీడింగ్ ఫైర్మన్లు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్ షేక్‌లకు ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • హోంగార్డులు చల్లా అశోక్‌రెడ్డి, చంద్ర సురేశ్, అబ్దుల్ షుకూర్బేగ్లకు హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • జైళ్లశాఖకు సంబంధించి హెడ్ వార్డర్ వలదాసు జోసెఫ్, చీఫ్ హెడ్ వార్డర్ జె.వీరాస్వామిలకు కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. 34 ఏళ్ల సర్వీసులో 30 రివార్డులు చౌటుప్పల్: కేంద్ర మెరిటోరియస్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి.. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై వరకు 34 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాట్రగడ్డ శ్రీనివాస్ ఇప్పటివరకు 30 రివార్డులు పొందారు. తాజాగా ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక మెడల్‌కు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మహేశ్ భగవత్‌కు మూడోసారి.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌కు ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్స్ దక్కడం ఇది మూడోసారి. 2004లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీపీఎంజీ), 2011లో పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పురస్కారాలను అందుకున్న ఆయన.. తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ముగ్గురు రైల్వే పోలీసులకు మెడల్స్ విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో ఆర్పీఎఫ్ ఎస్సైగా పనిచేస్తున్న సైదా తహసీన్, మౌలాలి రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రంలో ఏఎస్సై నాటకం సుబ్బారావు, ఇదే శిక్షణ కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి విజయ సారథి ఉన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
1993లో ఇంటర్వ్యూలో ఫెయిల్.. నాలాగా ఇబ్బంది పడొద్దనే..
సాక్షి, హైదరాబాద్: వృత్తిరీత్యా ఆయన పోలీస్ కమిషనర్. నిత్యం పనులతో బిజీనే. అయినా సమయం చిక్కించుకుని.. సివిల్స్ రాసే అభ్యర్థులకు శిక్షణ.. గైడెన్స్‌తో అండగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్లో 19 మందికి ఈయనే మెంటార్షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. మంగళవారం తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చదవండి: సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా ► 1993లో యూపీఎస్సీ మెయిన్స్‌లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా. చదవండి: సివిల్స్‌లో తెలుగువారి సత్తా ► హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది. మౌఖిక పరీక్షే ముఖ్యం ► సివిల్స్‌లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం. మరికొందరి సాయం.. భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్ఎస్లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్‌లు నీల్కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు. https://t.co/zb1mcIV0OA — Rachakonda Police (@RachakondaCop) September 28, 2021 -
కర్ఫ్యూ సమయంలో కొంతమంది బయటకు వస్తున్నారని..
-
పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!
మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్ఓసీ(లుక్ అవుట్ సర్టిఫికెట్) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్హెచ్ఓ మన్మోహన్ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు. వివాహం చేసుకోవడానికి అబ్బాస్ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని ఏప్రిల్ 17న పెళ్లి, 28న రిసెప్షన్ ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితునిపై ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహేష్ భగవత్‌పై డీసీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ డీసీపీ పులిందర్ రెడ్డి, తన ఉన్నతాధికారి రాచకొండ పోలీస్ కమీషనర్‌పై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేశారు. కమీషనర్ మహేష్ భగవత్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పులీందర్ రెడ్డి తనన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీసీపీ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డికి మానవహక్కుల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. -
వన్ డే సీపీ ఇషాన్
‘సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవేశద్వారం వద్ద కోలాహలం కనిపించింది. అంతలోనే పోలీసు కమిషనర్ కారులో సీపీ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు దిగాడు. మహేశ్ భగవత్ పుష్పగుచ్ఛం ఇచ్చి అతనికి స్వాగతం పలికారు. ఆరుగురు సాయుధ పోలీసులు ఆయుధాలతో గౌరవ వందనం చేశారు.భగవత్ ఆ చిన్నారిని మూడో అంతస్తులోని తన చాంబర్‌కు తీసుకెళ్లి అక్కడున్న ఆయన సీటులో కూర్చొబెట్టాడు. అతను నవ్వుతూ తన చేతిలోని కమిషనర్ కర్రను తిప్పుతూ అందరినీ చూస్తూ ఉండిపోయాడు’. ఏంటీ ఇదంతా చూస్తుంటే రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొత్తగా వచ్చిన వ్యక్తికి మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అనిపిస్తుందా.. అయితే చదవండి. సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం: విషయమేమిటంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా, కూచన్‌పల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు దూదేకుల ఇషాన్. తన కోరికను నెరవేర్చేందుకు మహేష్ భగవత్ ‘వన్ డే పోలీసు కమిషనర్’గా అవకాశం కల్పించారు. పోలీసు ఆఫీసర్ కావాలన్న అతడి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు శశిచంద్ర, ప్రియాజోషి సీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుర్రాడి మోములో ఆనందం చూశారు. ఒకరోజు రాచకొండ కమిషనర్‌గా ఎలా అనిపిస్తుందని మీడియా ఇషాన్‌ను ప్రశ్నించగా ‘భహుత్ కుష్ హూ’ అని నవ్వుతూ తెలిపాడు. అందరితో కరచలనం చేస్తూ ఎంతో సంతోషంగా చేతిలోని కర్రను తిప్పుతున్న దృశ్యాన్ని చూసిన అతని తల్లిదండ్రులు చాంద్‌పాషా, హసీనా కన్నీటి బాష్ఫాలు రాల్చారు. కోరిక తీరిందిలా... మెదక్ జిల్లా కూచన్‌పల్లిలో వాల్‌పేయింటింగ్ చేస్తూ జీవనం సాగించే దూదేకుల చాంద్‌పాషా, హసీనా దంపతులకు ముగ్గురు సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోఫియా మూడో తరగతి, ఇషాన్ రెండో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల తహసీన్ ఇంటివద్దే ఉంటుంది. భార్య హసీనా బీడీలు చుడతారని తెలిపాడు. చిన్నతనం నుంచే పోలీసు అవుతానని చెప్పే ఇషాన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో తమకు దిక్కుతోచడం లేదన్నాడు. నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేర్పించామని, వైద్యులు బాగానే చికిత్స చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సభ్యులు తమ పిల్లాడి కోరికను తెలుసుకొని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చి నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఒకరోజు సీపీతో మహేశ్‌భగవత్ సంభాషణ మహేశ్‌భగవత్: కైసా లగ్రే... ఇషాన్...? ఇషాన్: అచ్చా లగ్రా... హ.. హ.. హ..(నవ్వుతూ..) మహేశ్‌భగవత్: క్యాకరింగే పోలీస్ ఆఫీసర్ బన్కే ? ఇషాన్: లా అండ్ ఆర్డర్‌కు కంట్రోల్ కర్తా.. మహేశ్‌భగవత్: ఔర్ క్యా కరేగా.. ? ఇషాన్: చోరోంకో పకడ్కే జైల్ మే దాలూంగా.. ఔర్ సిగరేట్ పీనేవాలోంకో, గుట్కా కానేవాలోంకో జైల్‌మే దాలూంగా. మహేశ్‌భగవత్: ఔర్తోం కో క్యాకరేగా.. ? ఇషాన్: ఔరతోంకో ముష్కిల్ పైదా కర్నే వాలోంకో జైల్‌మే దాల్కే మార్తా మహేశ్‌భగవత్: ఔరతోంకో కైసా హెల్ప్ కర్తే.. ? ఇషాన్: నవ్వుతూ.. నైమాలూమ్... త్వరగా కోలుకోవాలి ఇషాన్‌కు ఆరేళ్లకే క్యాన్సర్ వ్యాధి సోకడం చాలా బాధగా ఉంది. బాలుడు త్వరగా కోలుకోవాలి. మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కలిసి బాలుడి కోరిక వివరించగా వెంటనే అం గీకరించాను. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స బాగా సాగుతోందని, తల్లిదండ్రులు కూడా చికిత్స తీరుపట్ల సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులు, యువకులు పోలీసులు, పోలీస్ ఆఫీస ర్లు కావాలనే కోరికను నెరవేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే చాలా మందికి పోలీసులమై ప్రజలకు న్యాయం చేయాలనే భావన కలుగుతోందన్నారు. –సీపీ మహేశ్‌భగవత్ -
టూరిస్టు వీసాలిచ్చి మోసగిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి మోసగిస్తున్న, దుబాయ్ పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నముఠాలోని కొందరు సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బి నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరక్షరాస్యులైన అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. అలాగే దుబాయ్‌కు పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచార గృహాలకు తరలించి డబ్బులు దండుకుంటున్నదని కూడా తెలిపారు. 12మంది సభ్యుల ఈ ముఠాలో ఐదుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారినుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా డాక్యుమెంట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ కేసు విషయంలో బాధితులు పిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఘట్కేసర్ ఎస్ఐ శోభన్‌బాబును 15 రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ, సిఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. -
‘శ్రీవాసవి’ యజమానులకు రిమాండ్
⇒ ఇంటర్ విద్యార్థులకు హాల్‌టికెట్ల నిరాకరణపై ఫిర్యాదు ⇒ వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన వనస్థలిపురం శ్రీవాసవి జూనియర్ కళాశాల యజమానులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. సుభద్రానగర్, వనస్థలిపురానికి చెందిన వై.ఆత్మజ్యోతి స్థానిక శ్రీవాసవి జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఫీజు రూ.9,000, పరీక్ష ఫీజు రూ.3,500 చెల్లించినా ఆమెకు యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ నెల ఒకటిన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఆత్మజ్యోతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల కరస్పాండెంట్లు వెంకటాపురం శీనయ్య(34), బండ శ్యాంసుందర్‌రెడ్డి (38)ని రిమాండ్‌కు తరలించామని కమిషనర్ తెలిపారు. మరో నిందితుడు గోపాల్‌గౌడ్ పరారీలో ఉన్నాడన్నారు. 102 మంది మొదటి సంవత్సరం, 144 మంది రెండో సంవత్సరం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారంతా ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్టు నిర్ధారించామన్నారు. విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు కూడా యాజమాన్యం అనుమతించలేదన్నారు. బాధ్యులందరిపైనా చర్యలు... ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది పాత్రపైనా అనుమానాలున్నాయని కమిషనర్ చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని... పరీక్ష ఫీజు రూ.360 కాగా... రూ.3,500 చొప్పున కళాశాల వసూలు చేయడంపైనా విచారణ జరుపుతున్నామన్నారు. కళాశాల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశామని, గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సీపీ సూచించారు. బోర్డు అధికారులకు డబ్బులిచ్చాం... గత ఏడాది జూన్‌లో ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలను పరిశీలించినట్లు శ్రీవాసవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ శీనయ్య తెలిపారు. గుర్తింపు కోసం ఇప్పటికే రూ.2 లక్షలు చెల్లించినట్లు, మరో రూ.5 లక్షలిస్తేనే గుర్తింపునిస్తామని బోర్డు అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. జరిగిందిలా... సూర్యాపేట పట్టణంలో శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి వరుణ్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేశారు. కళాశాలను వనస్థలిపురంలోని శ్రీమేధావి జూనియర్ కళాశాలకు మార్చారు. శ్రీమేధావిని మూసివేసి... శ్రీవాసవి జూనియర్ కళాశాలగా పేరు మార్చారు. శ్రీమేధావిలో రెండో సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులను శ్రీవాసవిలో చేర్చుకున్నారు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు.