Maama Mascheendra Movie: 'Galullona' Lyrical Song Released - Sakshi
Sakshi News home page

Maama Mascheendra: గాలుల్లోన కలలే వాలే... పాట విన్నారా?

Published Fri, May 5 2023 10:06 AM | Last Updated on Fri, May 5 2023 10:37 AM

Maama Mascheendra Movie: Galullona Lyrical Song Released - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, దర్శకుడు హర్షవర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా కథానాయికలు. సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గాలుల్లోన కలలే వాలే...’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్‌ కపిలన్, నూతన మోహన్‌ పాడారు. ‘‘ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు సుధీర్‌ బాబు. ‘గాలుల్లోన...’ అనే పాటలో దుర్గ, డీజే పాత్రల్లో ఆకట్టుకుంటారాయన. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

చదవండి: ఉగ్రం నా కెరీర్‌లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలుస్తుంది: అల్లరి నరేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement