ఆ విషయం చెప్పినప్పుడు నాన్న హృదయం ముక్కలైంది: హీరో | Sudheer Babu Got Emotional Over Ma Nanna Super Hero Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

నాన్నను ఇంతవరకు హగ్‌ చేసుకోలేదు.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌

Published Thu, Sep 12 2024 7:42 PM | Last Updated on Thu, Sep 12 2024 7:52 PM

Sudheer Babu Got Emotional Over Ma Nanna Super Hero Movie Teaser Launch

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా నాన్న సూపర్‌ హీరో. గురువారం (సెప్టెంబర్‌ 12న) ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి పోసాని నాగేశ్వరరావు గురించి చెప్తూ సుధీర్‌ స్టేజీపై ఎమోషనల్‌ అయ్యాడు.

ఎంత ప్రేమ ఉన్నా..
అతడు మాట్లాడుతూ.. 'మా నాన్నపై నాకెంత ప్రేమ ఉన్నా సరే ఇంతవరకు ఐ లవ్యూ చెప్పలేదు. హగ్‌ కూడా చేసుకోలేదు. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించుకోలేను. ఇప్పటికీ ఎన్నోసార్లు వెళ్లి ఆయన్ను హత్తుకోవాలనిపిస్తుంటుంది కానీ ఆగిపోతుంటాను. అందుకే నా పిల్లల్ని హగ్‌ చేసుకుంటాను. 

ఎక్కువగా గొడవలు
మా నాన్న ఎప్పుడూ, ఎవరిపైనా కోప్పడరు. నాకేమో చిన్నదానికే కోపం వచ్చేస్తుంటుంది. బాల్యంలో ఎక్కువగా గొడవలు పెట్టుకునేవాడిని. దాంతో అమ్మానాన్న.. నువ్వు మాకు పుట్టలేదు, అడవిలో దొరికావు అని చెప్పేవారు. 12వ తరగతికి వచ్చేదాకా అదే నిజమని నమ్మాను. మా ఫ్రెండ్స్‌తో కూడా నేను మా పేరెంట్స్‌కు పుట్టలేదంట, దొరికాను అని చెప్పేవాడిని.

 ఏడేళ్లపాటు కష్టపడ్డారు
నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు నాన్న అప్పు చేసి మరీ పెస్టిసైడ్‌ షాప్‌ పెట్టారు. ఉదయం తొమ్మిదింటికి వెళ్లి రాత్రి 12 గంటలకు వచ్చేవారు. అలా ఏడేళ్లపాటు కష్టపడ్డారు. ఈరోజు ఇండియాలోనే పెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగారు. ఆయన ఏం చేసినా మా సంతోషం కోసమే చేసేవారు. తను కష్టజీవి.

సుధీర్‌ ఎమోషనల్‌
నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తన గుండె పగిలినంత పనైంది. అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాను' అని సుధీర్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు. మా నాన్న సూపర్‌ హీరో మూవీ అక్టోబర్‌ 11న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: ఓడిన సోనియా.. గెలిచి చూపించిన నిఖిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement