
యంగ్ హీరో సుధీర్‌బాబు తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి 'హరోం హర’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. ది రివోల్ట్ అనేది క్యాప్షన్. చిత్రబృందం. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైవిధ్య కథలతో మంచి గుర్తింపు సాధించిన నటుడు సుధీర్‌బాబు. ఇటీవలే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీతో ప్రేక్షకులను అలరించారు.
(చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం)
తాజాగా మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ విడుదలైన వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదో.. చేసేదే’ అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఆ వీడియోను చూస్తే ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సాగే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment