మొన్న గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడేమో స్టైలిష్‌గా యంగ్‌ హీరో! | Maama Mascheendra Movie: Meet Parasuram | Sakshi
Sakshi News home page

Sudheer Babu: స్టైలిష్‌ అవతారంలో సుధీర్‌ బాబు

Published Sun, Mar 5 2023 9:57 AM | Last Updated on Sun, Mar 5 2023 9:57 AM

Maama Mascheendra Movie: Meet Parasuram - Sakshi

దుర్గ లావుగా, మాస్‌గా ఉంటాడు. దుర్గకు పూర్తి భిన్నంగా ఉంటాడు పరశురామ్‌. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్‌ గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తాడు. డ్రెస్సింగ్, సిట్టింగ్‌.. అంతా ఫుల్‌ స్టయిల్‌. ఇక్కడున్న పరశురామ్‌ లుక్‌ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పాత్రల్లో సుధీర్‌బాబు నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇటీవల దుర్గ లుక్‌ని, శనివారం పరశురామ్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు.

హర్షవర్ధన్‌ దర్శకత్వంలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా, సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement