ఓటీటీల దెబ్బకు మనం సినిమాలు చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్‌లో సినిమా రిలీజైన చాన్నాళ్లకు హెచ్‌డీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేది. కానీ ఓటీటీల పుణ్యామా అని కొన్ని డైరెక్ట్‌గా వీటిలోనే రిలీజ్ అవుతుండగా, మరికొన్ని నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఓ మూవీ అయితే థియేటర్లలో ఉండగానే ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిందట.
(ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ)
ఆ సినిమా ఏంటి?
సుధీర్‌బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. అక్టోబరు 6న అంటే రెండు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించేసినట్లు తెలుస్తోంది.
ఆ రోజే స్ట్రీమింగ్
అక్టోబరు 24న దసరా పండగ. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సందడి గ్యారంటీ. మరోవైపు ఈ ఫెస్టివల్ సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు అదే పండక్కి అంటే అక్టోబరు 20 నుంచి 'మామా మశ్చీంద్ర' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ అయిపోతున్నట్లే.
(ఇదీ చదవండి: ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?)
#MaamaMascheendra from October 20. 📸 @PrimeVideoIN #MaamaMaschindra pic.twitter.com/Ptv3HhFio8
— SpreadFLIX (@spreadflix) October 8, 2023
Comments
Please login to add a commentAdd a comment