'విజయవాడలో ఇంజినీరింగ్ డేస్'.. నెటిజన్స్‌కు డైరెక్టర్ ఆర్జీవీ సవాల్! | Ram Gopal Varma Shares His Old Photo In Twitter Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: 'తన ఫ్రెండ్స్‌తో రాంగోపాల్ వర్మ'.. నెటిజన్స్‌కు డైరెక్టర్ సవాల్!

Published Sun, Aug 11 2024 7:59 PM | Last Updated on Mon, Aug 12 2024 12:58 PM

Ram Gopal Varma Shares His Old Photo In Twitter Goes Viral

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆర్జీవీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది.

తాను విజయవాడలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఫోటోను రాంగోపాల్ వర్మ ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో తాను ఎక్కడున్నానో కనిపెట్టాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. అయితే ఆ ఫోటోలో అందరి మొహాలు కాస్తా బ్లర్‌గా ఉన్నాయి. అందువల్లనే ఆడియన్స్‌కు ఆర్జీవీ చిన్న పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement