
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'ది బర్త్ డే బాయ్'. ఈ సినిమాకు విస్కీ దాసరి దర్శకత్వం వహించారు. బొమ్మా బొరుసా బ్యానర్‌పై భరత్ నిర్మించారు. జులై 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీకి వచ్చేస్తోంది. ఈనెల 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అసలు కథేంటంటే..
బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్లు. అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్లలో బాలు పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్స్‌లో బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు. నొప్పి తట్టుకోలేక బాలు చనిపోతాడు. ఉన్నది అమెరికా కావడంతో కుర్రోళ్లు భయపడతారు. వీళ్లందరూ అర్జున్ సోదరుడు భరత్ (రవికృష్ణ)ని పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా చంపేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ. థియేటర్లలో చూడనివారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
An unforgettable day for the..🙅🏻♂️ #Thebirthdayboy 🎂 premieres August 9th at 2 PM only on aha @actorsameersamo @rajeevco @pramodini15 @MAniGoudMG @vikranthved @Rchilam pic.twitter.com/S5yl6N4n29
— ahavideoin (@ahavideoIN) August 8, 2024