ఎమోషనల్‌గా థ్రిల్లర్‌గా వస్తోన్న పౌరుషం.. ఆసక్తిగా ట్రైలర్! | Tollywood Movie Pourusham The Man Hood Movie Trailer Out now | Sakshi
Sakshi News home page

Pourusham Trailer: ఎమోషనల్‌గా థ్రిల్లర్‌గా పౌరుషం.. ఆసక్తిగా ట్రైలర్!

Published Fri, Jul 5 2024 8:18 PM | Last Updated on Fri, Jul 5 2024 8:19 PM

Tollywood Movie Pourusham The Man Hood Movie Trailer Out now

సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పౌరుషం - ది మ్యాన్‌హుడ్". ఈ సినిమాను షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని యూవీటీ హాలీవుడ్ స్టూడియోస్, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు.  తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

తాజాగా విడుదలైన పౌరుషం: ది మ్యాన్‌హుడ్ ట్రైలర్ చూస్తుంటే..  ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక,  కెవ్వు కార్తీక్ కీలక పాత్రల్లో పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement