1134 మూవీ రివ్యూ .. ఎలా ఉందంటే? | Tollywood Movie 1134 Review In Telugu | Sakshi
Sakshi News home page

1134 Review In Telugu: 1134 మూవీ ఎలా ఉందంటే..?

Published Fri, Jan 5 2024 8:59 PM | Last Updated on Sat, Jan 6 2024 1:22 PM

Tollywood Movie 1134 Review In Telugu - Sakshi

టైటిల్: 1134

నటీనటులు: కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ తదితరులు

దర్శకత్వం: శరత్ చంద్ర తడిమేటి
నిర్మాణ సంస్థ:  శాన్వీ మీడియా 
నిర్మాత: : శరత్ చంద్ర తడిమేటి
సహ నిర్మాత: భరత్ కుమార్ పాలకుర్తి
సంగీతం: శ్రీ మురళీ కార్తికేయ
సినిమాటోగ్రఫీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి 

విడుదల తేదీ: జనవరి 5,2024


న్యూ ఏజ్ మేకర్లు తెరపై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. చిన్న చిన్న కాన్సెప్ట్‌లు తీసుకుని సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నారు. ఇలాంటి ఓ క్రమంలోనే నో బడ్జెట్ అంటూ అందరూ తలా ఓ చేయి వేసుకుని చేసిన చిత్రమే 1134. టీజర్, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడంతో సినిమా మీద బజ్ ఏర్పడింది. జనవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే.. 

1134 అనే కథ ఓ ముగ్గురి మధ్య జరుగుతుంది. లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే మూడు పాత్రల మధ్య సాగుతుంది. ఈ ముగ్గుర్ని కిడ్పాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఏటీఎం వద్ద ఉండే కెమెరాలు హ్యాక్ చేయడం, బస్ స్టాప్‌లో వద్ద కనిపించే బ్యాగులను దొంగతనం చేయడం, ఏటీఎంలో ఇల్లీగల్‌గా డబ్బులు తీయడం ఇలాంటి చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ఉండే ఆ ముగ్గురికి ఉన్న లింక్ ఏంటి? ఈ ముగ్గురు అసలు ఆ పనులు ఎందుకు చేస్తుంటారు? ఈ ముగ్గురిని కలిపి ఆ క్రైమ్ స్టోరీ ఏంటి? ఈ కథలో 1134 అంటే ఏంటి? చివరకు ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 

క్రైమ్, రాబరి, మిస్టరీ, సస్పెన్స్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ ప్రయోగమే చేశాడు నూతన దర్శకుడు శరత్. తాను ఎంచుకున్న పాయింట్‌ నుంచి ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా తీశాడు. అనుకున్నది అనుకున్నట్టుగా తీసినట్టు కనిపిస్తుంది. మూడు పాత్రల పరిచయం, వాటి తాలుకూ ఫ్లాష్ బ్యాక్, వారి వారి నేపథ్యాలు చూపిస్తూ ఫస్ట్ హాఫ్‌ను అలా తీసుకెళ్లాడు. ఇంటర్వెల్‌కు ముందు అదిరిపోయేలా ట్విస్ట్ ఇచ్చి ఫస్ట్‌ హాఫ్‌ను ముగించాడు.

సెకండాఫ్‌కు వచ్చే సరికి చిక్కుముడులన్నీ విప్పినట్టుగా ఉంటాయి. ఆ ముగ్గురి వెనుకున్నది ఎవరు? ఆ క్రైమ్స్‌ను చేయిస్తున్నది ఎవరు? దీని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా సెకండాఫ్ కొనసాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే సరికి కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా ప్రేక్షకుడ్ని థ్రిల్ చేయడంలో మాత్రం 1134 డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేశారంటే.. 
కొత్త వాళ్లతో సినిమాను చేయడం పెద్ద సాహసమే. కొత్త వాళ్లందరూ కలిసి సినిమా చేయడం మరింత సాహసం. కొత్త వాళ్లైనా కూడా అందరూ చక్కగా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. కృష్ణగా (కృష్ణ మదుపు), ఎరిక్‌గా (గంగాధర్ రెడ్డి), హర్షగా (ఫణి భార్గవ్), లక్ష్మణ్‌గా (ఫణి శర్మ) ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. టెక్నికల్‌గా కెమెరా వర్క్, ఆర్ఆర్ బాగున్నాయి. ఎడిటింగ్ ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. శాన్వీ మీడియా, నిర్మాత భరత్ కుమార్ పాలకుర్తి ప్యాషన్ తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement