దెయ్యం ఇతివృత్తంతో.. పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

దెయ్యం ఇతివృత్తంతో.. పార్క్‌

Published Fri, Jul 5 2024 1:28 AM | Last Updated on Fri, Jul 5 2024 1:55 PM

దెయ్యం ఇతివృత్తంతో పార్క్‌

దెయ్యం ఇతివృత్తంతో పార్క్‌

తమిళసినిమా: అక్షయ మూవీ మేకర్స్‌ పతాకంపై నటరాజ్‌ నిర్మిస్తున్న చిత్రం పార్క్‌. దర్శకుడు ఏ వెంకటేష్‌ శిష్యుడు ఈకే మురుగన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో తమన్‌కుమార్‌ కథా నాయకుడుగా నటిస్తున్నారు. ఈయన ఇంతకుముందు నటించిన ఒరునొడి చిత్రం మంచి విజయా న్ని సాధించింది.

కాగా ఈ తాజా చిత్రంలో నటి శ్వేత టోరది నా యకిగా నటిస్తుండగా ప్రధాన ప్ర తినాయకుడిగా యోగిరామ్‌ నటిస్తున్నారు. కాగా నిర్మాణ కార్యక్ర మం పూర్తి చేసుకున్న పార్క్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ము స్తాబవుతుంది. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చే సిన ఓ ప్రకటనలో ఇలా పేర్కొన్నా రు. ఇది దెయ్యం ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రమని చె ప్పారు. దీన్ని పర్ఫెక్ట్‌ ప్రణాళికతో 36 రోజుల్లోనే షూటింగు పూర్తి చే సినట్లు చెప్పారు.

ఇంతకుముందు అనేక దెయ్యాల కథా చిత్రాలు ప్రే క్షకులు చూసి ఉంటారని, అందు లో దెయ్యాలను వదిలించడానికి వివిధ మతాలకు చెందిన స్వా మీజీలనో, మంత్రగాళ్లనో చూపించి ఉంటారన్నారు. అయితే ఈ చిత్రంలో దెయ్యాన్ని వదిలించడానికి ఏ మతానికి చెందిన స్వామీజీలు గానీ మంత్రగాళ్లుగానీ చూపించలేదని, వేరే విధానంలో దెయ్యా న్ని వదిలించే సన్నివేశాలు చోటు చేసుకుంటా యని చెప్పారు. ఇలాంటి సన్నివేశాలను ఏ చిత్రంలోనూ చూసి ఉండరని చెప్పారు.

హారర్ర్‌ కథా చిత్రాలకు మినిమం గ్యారంటీ ఉంటుందని, పెట్టుబడి పెట్టే నిర్మాతలను అలాంటి చిత్రాలు కాపాడుతాయని, అందుకే ఈ హారర్ర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో పార్క్‌ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement