thamil nadu
-
దెయ్యం ఇతివృత్తంతో.. పార్క్
తమిళసినిమా: అక్షయ మూవీ మేకర్స్ పతాకంపై నటరాజ్ నిర్మిస్తున్న చిత్రం పార్క్. దర్శకుడు ఏ వెంకటేష్ శిష్యుడు ఈకే మురుగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో తమన్‌కుమార్ కథా నాయకుడుగా నటిస్తున్నారు. ఈయన ఇంతకుముందు నటించిన ఒరునొడి చిత్రం మంచి విజయా న్ని సాధించింది.కాగా ఈ తాజా చిత్రంలో నటి శ్వేత టోరది నా యకిగా నటిస్తుండగా ప్రధాన ప్ర తినాయకుడిగా యోగిరామ్ నటిస్తున్నారు. కాగా నిర్మాణ కార్యక్ర మం పూర్తి చేసుకున్న పార్క్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ము స్తాబవుతుంది. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చే సిన ఓ ప్రకటనలో ఇలా పేర్కొన్నా రు. ఇది దెయ్యం ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రమని చె ప్పారు. దీన్ని పర్ఫెక్ట్ ప్రణాళికతో 36 రోజుల్లోనే షూటింగు పూర్తి చే సినట్లు చెప్పారు.ఇంతకుముందు అనేక దెయ్యాల కథా చిత్రాలు ప్రే క్షకులు చూసి ఉంటారని, అందు లో దెయ్యాలను వదిలించడానికి వివిధ మతాలకు చెందిన స్వా మీజీలనో, మంత్రగాళ్లనో చూపించి ఉంటారన్నారు. అయితే ఈ చిత్రంలో దెయ్యాన్ని వదిలించడానికి ఏ మతానికి చెందిన స్వామీజీలు గానీ మంత్రగాళ్లుగానీ చూపించలేదని, వేరే విధానంలో దెయ్యా న్ని వదిలించే సన్నివేశాలు చోటు చేసుకుంటా యని చెప్పారు. ఇలాంటి సన్నివేశాలను ఏ చిత్రంలోనూ చూసి ఉండరని చెప్పారు.హారర్ర్ కథా చిత్రాలకు మినిమం గ్యారంటీ ఉంటుందని, పెట్టుబడి పెట్టే నిర్మాతలను అలాంటి చిత్రాలు కాపాడుతాయని, అందుకే ఈ హారర్ర్, థ్రిల్లర్ నేపథ్యంలో పార్క్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
స్టార్‌కు ఓ న్యాయం... మాకో న్యాయమా?
సాక్షి, చెన్నై: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఓ న్యాయం...తమకు మరో న్యాయమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజీవ్ హత్యకేసు నింధితులు ప్రశ్నించే పనిలో పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సంజయ్‌దత్‌ను విడుదల చేసినట్టుగానే రాజీవ్ హత్య కేసు నిందితుల్ని కూడా విడుదల చేయాలని న్యాయవాదులు పట్టుబట్టే పనిలో పడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్‌తో పాటు ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించినా, రాజ్‌భవన్‌లో స్పందన లేని దృష్ట్యా, చివరకు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్నిస్తూ నిందితుల తరఫున రవిచంద్రన్ ఓలేఖ కూడా రాశారు. నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పేరరివాలన్ కొన్నేళ్లుగా చేసిన న్యాయ పోరాటం, తీవ్ర ప్రయత్నాలకు ఫలితంగా ప్రస్తుతం ఓ కేసు విషయంగా కీలక ఆధారాల్ని సేకరించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలుశిక్షను సైతం అనుభవించిన బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ విడుదల వ్యవహారాన్ని పేరరివాలన్ గతంలో అస్త్రంగా చేసుకున్నారు. సీబీఐ విచారిస్తున్న, విచారించిన కేసుల్లో ముందస్తు విడుదల వ్యవహారంలో కేంద్రం ఆదేశాలు, నిర్ణయం తప్పనిసరి అన్న వాదనను పరిగణించి సమాచార హక్కు చట్టం మేరకు సంజయ్‌దత్ విడుదలకు వర్తింపచేసిన నిబంధనల వివరాలను పేరరివాలన్ సేకరించారు. ఇందులోని అంశాలన్ని పేరరివాలన్ తరఫు న్యాయవాదులు మీడియా దృష్టికి తెచ్చారు. ఇదేనా న్యాయం.. సంజయ్‌దత్‌ను ముందస్తుగా విడుదల చేసిన వ్యవహారంలో ఎలాంటి కేంద్రం అనుమతుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పొందనట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు తేలాయి. మహారాష్ట్ర జైళ్ల శాఖ నింబంధనలకు అనుగుణంగానే ఆయన్ను విడుదల చేసి ఉండటం గమనార్హం. సంజయ్ దత్‌కు శిక్ష విధించిన సమయంలో కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరిన్ని వివరాలను రాబట్టి ఉన్నారు. అలాగే, సంజయ్ దత్ కేసును సీబీఐ విచారించిందని, అది కూడా బాంబు పేలుళ్ల కేసు అని, ఆ కేసులో కేంద్రం అనుమతి అన్నది పొందనప్పుడు, ఈ ఏడుగురి విడుదల విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం అనుమతి...? అని పేరరివాలన్ న్యాయవాదులు ప్రశ్నించారు. సంజయ్ దత్‌కు ఓ న్యాయం...రాజీవ్ హత్య కేసు నింథితులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరంగా పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని అంశాల్ని అస్త్రంగా చేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదే సమయంలో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జైళ్ల శాఖ నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సెక్షన్ 161 మేరకు ఎవ్వరి అనుమతి అన్నది లేకుండా తమిళనాడు ప్రభుత్వానికే ఆ ఏడుగురి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. అంతే గాని, మంత్రి వర్గం ఆమోదాన్ని రాజ్ భవన్‌కు పంపించి, అక్కడ ఆమోదం కోసం ఎదురు చూడకుండా,త మిళనాడు ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్చేస్తున్నారు. -
ఆ సారు మళ్ళీ తిరిగొచ్చేశారు
సాక్షి, చెన్నై: భగవాన్ మాస్టర్ బదిలీపై ఆందోళకు దిగిన విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు తమిళనాడు సర్కార్ దిగి వచ్చింది. భగవాన్ మాస్టర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ అంశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన బదిలీని నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. బదిలీని నిలిపివేయాలంటూ పిల్లలు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భగవాన్ను బదిలీ చేయడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. భగవాన్ మాస్టారు తిరిగి స్కూలుకు వచ్చారన్న వార్త విన్న విద్యార్థులు స్కూలుకు పరుగులు తీశారు. తమకు ఎంతో ఇష్టమైన టీచర్ తిరిగి రావడంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు అంతా సంబురాలు చేసుకున్నారు. మాస్టారును హత్తుకుని తమ ప్రేమను చాటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పరిణామంపై ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తన కోసం పడ్డ తపన చూసి భగవాన్ కళ్లు చెమర్చాయంటూ భగవాన్ సంతోషం వ్యక్తంచేశారు. ఓ విద్యార్ధి తండ్రి మాటల్లో... 'నా కూతురు దేనికీ ఇంతగా సంతోషపడ లేదు' అని తొమ్మిదో తరగతి చదువుతోన్న సంఘవి అనే విద్యార్థిని తండ్రి వెల్లడించారు.' భగవాన్ సార్ ఏ పాఠమైనా అద్భుతంగా చెప్తారు. ప్రొజెక్టర్ల సాయంతో మాకు అర్థమయ్యే రీతిలో బోధిస్తారని విద్యార్ధులు తెలిపారు. కాగా తిరువల్లూరు జిల్లా వెల్లియగరం ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ టీచర్ భగవాన్ బదిలీకావడంతో అక్కడి విద్యార్థుల్లో తీవ్ర విచారాన్ని నింపింది. దీంతో వారు తమకెంతో ఇష్టమైన భగవాన్ సార్ తమను విడిచి వెళ్లడానికి అంగీకరించలేకపోయారు. మా సార్ మాకు కావాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
బీజేపీ నేత ఇంట్లో కోట్లల్లో పాత కరెన్సీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా ఆ ఇంట్లో కట్టలుకట్టలుగా పాత కరెన్సీ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45 కోట్ల నోట్లు. సాక్షాత్తు బీజేపీ నేత ఇంటి నుంచి గురువారం ఈ భారీ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీజేపీకి చెందిన ప్రముఖ నేత దండపాణి చెన్నై కోడంబాక్కం జక్రియాకాలనీ 2వ వీ«ధిలో నివసిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇతని సోదరులు పోలీస్‌శాఖలో పనిచేస్తూ సినిమా రంగంలో ఉండేవారికి దుస్తులు కుట్టించే రామలింగ్ అండ్ కో అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరికి ఇదే కాలనీలో పదికి పైగా ఇళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దండపాణి తన బంధుమిత్రులతో కలిసి అవసరమైన వారికి రూ.500, రూ.1000ల చెల్లనినోట్లనుకొత్త నోట్లు మార్చి ఇచ్చే వ్యవహారం నడుపుతున్నట్లు కోడంబాక్కం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సీఐ చిట్టిబాబు నేతృత్వంలో దండపాణి ఇంటిపై నిఘా పెట్టారు. ఈ దశలో బుధవారం సాయంత్రం వీరింటికి కొందరు అనుమానాస్పద వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించి గురువారం తెల్ల వారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పది పెట్టెల్లో దాచి ఉంచిన రూ.45 కోట్ల విలువైన రూ.500, రూ.1000ల చెల్లని నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకుని దండపాణిని పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు కమీషన్ పై పాత నోట్లను మార్చి ఇచ్చేలా లావాదేవీలు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా పాతనోట్లు మార్చినందుకు 50 శాతం కమీషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుసుకుని పోలీసులు నోరు వెళ్లబెట్టారు. భారీ ఎత్తున పాతనోట్లు పట్టుబడిన విషయాన్ని ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నగరంలో జ్యువెలరీ షాపు నడిపే ఒక పారిశ్రామిక వేత్తను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత చెన్నైలో ఒకే ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడడం కలకలానికి దారితీసింది. కమీషన్ చెల్లించి పాత నోట్ల మార్పిడిని కోరిన వారెవరు. ఇందుకు సహకరించేవారు ఎవరు, దండపాణి పరిధిలో ఇంకా ఎంతమంది వద్ద పాత నోట్లు ఉన్నాయి అని పోలీసులు విచారిస్తున్నారు. -
ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరూర్ జిల్లా కుళితలై వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెల్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాల్‌పై హత్యాబెదిరింపుల కేసు
తమిళసినిమా: నటుడు, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్ కామాక్షి స్థానిక వడపళనిలోని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండిలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి పోటీగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశానన్నారు. అదే విధంగా నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల సంఘం సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానన్నారు. అయితే నటుడు విశాల్‌కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదన్నారు.ఇటీవల నడిగర్‌సంఘ నూతన భవన నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసిందన్నారు. అందుకు కారణం సంఘం స్థల ఆక్రమణేనని పేర్కొన్నారు. దీంతో తాను సంఘ చర్యలను విమర్శిస్తూ తన ఫేస్బుక్లో పేర్కొన్నానన్నారు. దీంతో విశాల్ తన అభిమానులకు తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆయన అభిమానులుగా చెప్పుకుంటున్న తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్ కామాక్షి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు. -
15 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థికసాయం
కేకే.నగర్: విద్యుదాఘాతానికి బలైన 15 మంది కుటుంబీకులకు తలా రూ.3 లక్షలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాట్టాంగళత్తూరుకు చెందిన శేఖర్, మీంజూరుకు చెందిన గోవిందన్, పిల్లూర్‌కు చెందిన షణ్ముగం, ఆగైతంబి, కన్నన్, చిత్తయ్యన్, యువరాజ్, ఫోర్‌మెన్‌గా పనిచేసిన వాసుదేవన్, సీబీ, గుణశేఖరన్, మహిమ, సెల్వ సుందరి, మాయకన్నన్, జానకిరామన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటనలు తననెంతో బాధించాయన్నారు. రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం.. దిండుకల్ సమీపంలో లారీ, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సీనియమ్మాళ్, సంజయ్, సోమసుందరం, నారాయణన్, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందిన వార్త తనకెంతో ఆవేదన కలిగించిందని సీఎం తెలిపారు. గాయపడిన వారికి తలా రూ.50 వేలు, స్వల్పగాయాల పాలైన వారికి తలా రూ. 25 వేలు ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి అందచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. చిన్నారితో సీఎం ఫొటో.. మదురై నుంచి చెన్నైకు శుక్రవారం విమానంలో సీఎం ఎడపాడి పళనస్వామి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న తేని జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రియదర్శిని సీఎంతో ఫొటో దిగాలని ప్రయత్నించింది. గమనించిన సీఎం చిన్నారితో ఫొటో దిగారు. -
మార్పు కావాలి.. మీరు రావాలి
తమిళసినిమా: ప్రజలకు మార్పు కావాలి. మీరు రావాలి. ఏంటీ సీన్ అర్థం అయిపోయిందా? అవును మన సూపర్‌స్టార్ అభిమానుల చిరకాల ఆకాంక్ష ఇదే. అలా జరగాలని వారు కంటున్న కల ఇదే. రజనీకాంత్ ఎస్ అన్న ఒకే ఒక్క మాటకు ప్రస్తుత తమిళనాడు రాజకీయ చరిత్రను ఒక్కసారిగా మార్చివేసే శక్తి ఉంది. ఇది చాలా కాలం క్రితమే రుజువైంది. ఆ తరువాత కూడా ఆ దేవుడు శాసిస్తే ఈ రజనీకాంత్ పాటిస్తాడు అన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగించాయి. దీంతో పలు రాజకీయ పార్టీలు ఆయన మద్దతు కోసం అర్రులుచాశాయి, చాస్తున్నాయి కూడా. ఇటీవల కూడా బీజేపీ పార్టీ ఆర్కేనగర్ ఉప ఎన్నిల్లో రజనీకాంత్ మద్దతు ఆశించింది. అయితే రజనీకాంత్ ఏ పార్టీకీ మద్దతు తెలుపకుండా మౌనంగానే ప్రస్తుత రాజకీయ పరిణామాలను క్షుణంగా గమనిస్తున్నారు. అంతే కాదు తన అభిమానులతో కలయిక అంటూ అప్పుడప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక జర్క్ ఇస్తున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం తలైవా మీరు రాజకీయాల్లోకి వచ్చే తీరాలి అంటూ తమ మనోవాంచను తరచూ పలు విధాల చర్యలతో రజనీ దృష్టికి తీసుకొసూ్తనే ఉన్నారు. తాజాగా పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఇంద నిలై మారవేండుం..మక్కళ్కు మాట్రం వేండుం..నీంగ సీఎం ఆగవేండుం(ప్రస్తుత పరిస్థితి మారాలి..ప్రజలకు మార్పు కావాలి..మీరు సీఎం కావాలి) అన్న నినాదాలతో చెన్నై నగరం అంతా భారీ పోస్టర్లు వెలశాయి. ఆ పోస్టర్లలో రజనీకాంత్ ఠీవీగా కుర్చీలో కూర్చుని చిరుదరహాసం చేస్తున్న ఫొటో దర్శనమిస్తోంది.