15 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థికసాయం
కేకే.నగర్: విద్యుదాఘాతానికి బలైన 15 మంది కుటుంబీకులకు తలా రూ.3 లక్షలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాట్టాంగళత్తూరుకు చెందిన శేఖర్, మీంజూరుకు చెందిన గోవిందన్, పిల్లూర్‌కు చెందిన షణ్ముగం, ఆగైతంబి, కన్నన్, చిత్తయ్యన్, యువరాజ్, ఫోర్‌మెన్‌గా పనిచేసిన వాసుదేవన్, సీబీ, గుణశేఖరన్, మహిమ, సెల్వ సుందరి, మాయకన్నన్, జానకిరామన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటనలు తననెంతో బాధించాయన్నారు.
రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం..
దిండుకల్ సమీపంలో లారీ, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సీనియమ్మాళ్, సంజయ్, సోమసుందరం, నారాయణన్, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందిన వార్త తనకెంతో ఆవేదన కలిగించిందని సీఎం తెలిపారు. గాయపడిన వారికి తలా రూ.50 వేలు, స్వల్పగాయాల పాలైన వారికి తలా రూ. 25 వేలు ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి అందచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
చిన్నారితో సీఎం ఫొటో..
మదురై నుంచి చెన్నైకు శుక్రవారం విమానంలో సీఎం ఎడపాడి పళనస్వామి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న తేని జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రియదర్శిని సీఎంతో ఫొటో దిగాలని ప్రయత్నించింది. గమనించిన సీఎం చిన్నారితో ఫొటో దిగారు.