మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు ఈ బర్త్‌డే(మార్చి 27) చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ గత శుక్రవారం(మార్చి 25) విడుదలై..పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ బర్త్‌డేని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. లక్షలాది మంది ఫ్యాన్స్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ అరుదైన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం. హ్యాపీ బర్త్ డే చరణ్’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H
Comments
Please login to add a commentAdd a comment