Happy Birthday Ram Charan: Chiranjeevi Special Video Share Birthday Wishes To His Son Ram Charan, Then, Now, Always He Is Caring Son - Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ బర్త్‌డే: మెగాస్టార్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published Sat, Mar 27 2021 11:06 AM | Last Updated on Sat, Mar 27 2021 1:41 PM

Chiranjeevi Special Wishes On Son Ram Charan Birthday - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం తనయుడికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా చెర్రికి వీడియో రూపంలో చిరు విషెస్‌ అందించించాడు. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్’‌ అంటూ వీడియో రూపంలో అందించిన ఈ పోస్టు మెగా అభిమానులను భావోద్యేగానికి గురిచేస్తోంది.

చిరంజీవి నటించిన డాడీ చిత్రంలోని ‘గుమ్మాడి గుమ్మాడి’ పాట మ్యూజిక్‌ బ్యాగ్రౌండ్‌లో వస్తుండగా.. చిన్నప్పుడు రామ్‌ చరణ్‌ చిరుకు గొడుగు పట్టుకున్న ఫొటోతో పాటు.. పెద్దయ్యాక కూడా తండ్రికి గొడుగు పడుతున్న మరో రెండు ఫొటోలను మెగాస్టార్‌ వీడియోలో పంచుకున్నాడు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడు.. చరణ్‌ ఈజ్‌ ఎ కేరింగ్‌ సన్‌’ అంటూ  చిరు చెప్పుకొచ్చాడు. చివరగా సతీమణి సురేఖ, తనయుడు చెర్రీతో ఉన్న ఫొటోను చిరంజీవి జత చేశాడు.  

 

చదవండి: 
రామ్‌ చరణ్‌ బర్త్‌డే: ఎన్టీఆర్‌ స్పెషల్‌ విషెస్
ఆర్‌ఆర్‌ఆర్‌ : రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement