
పుట్టిన రోజు(జనవరి 25) సందర్భగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్ శ్రుతీ హాసన్. తనపై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘నాపై ప్రేమను చూపేందుకు టైమ్ కేటాయించిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రేమను మాటల్లో చెప్పలేను. ఈ అందమైన, క్లిష్టమైన భూమిపై నా జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయింది. కానీ నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసు. నన్ను నేను రియాలిటీకి దగ్గరగా ఉంచుకోవాలనుకుంటాను. ప్రత్యక్షంగా కావొచ్చు.. పరోక్షంగా కావొచ్చు. జీవితంలో నాకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుంటాను’అని పుట్టినరోజు సందర్భంగా శ్రుతి తన మనసులోని మాటలను వ్యక్తపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment