
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పాటు సినీ రంగానికి చెందినవారు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎ క్స్‌లో పేర్కొన్నారు.
ప్రధాని పోస్టుకు రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని చెప్పారు. మరోవైపు సీఎం శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు.

Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) November 8, 2024
Comments
Please login to add a commentAdd a comment