
Shanmukh Birthday Wishes To Deepthi Sunaina Shares Old Pic: సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ నెట్టింట హాట్‌టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ బిగ్‌బాస్ షో అనంతరం దీప్తి సునయన షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పేసింది. ఇక కలిసుండలేమంటూ తమ 5ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. అయితే ఇది షణ్ముఖ్‌కి ఇష్టం లేకపోయినా దీప్తి నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది.
ఇక బ్రేకప్ తర్వాత వీరిద్దరి సోషల్‌మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరు షేర్ చేస్తున్న పోస్టులు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
నేడు(సోమవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా.. 'హ్యాపీ బర్త్‌డే డీ(D)'అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షణ్నూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై దీప్తి ఇంతవరకు స్పందించలేదు.