
Chiranjeevi Special Wishes To Allu Arjun On Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ సెలబ్రెటీల బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బన్నీ. వర్క్ పట్ల నువ్వు చూపించే పట్టుదల, అంకితభావం.. కష్టపడేతత్త్వమే నిన్ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఈ పుట్టిన రోజును ల్యాండ్‌మార్క్ బర్త్‌డేగా మార్చుకో’ అంటూ చిరు క్రేజీగా విషెస్ తెలిపారు.
చదవండి: అంబులెన్స్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్, ఫొటో వైరల్
దీంతో చిరు ట్వీట్‌ను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన ట్వీట్‌ను ర్వీట్వీట్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లో ఈ ట్వీట్‌కు 23వేలకు పైగా లైక్స్, 4 వేలకు పైగా రీట్వీట్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. కాగా నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి సినిమాతో బన్నీ హీరోగా పరిచయయ్యాడు. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుని నేషనల్ స్టార్‌గా ఎదిగాడు.
Happy Birthday Bunny @alluarjun 🎂 Your hard work & focus gives you success. Party hard & make this landmark birthday memorable. 🎉
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2022