బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’ | Chiranjeevi And Film Industry Celebrities Birthday Wishes To Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’

Apr 8 2020 1:52 PM | Updated on Apr 8 2020 1:52 PM

Chiranjeevi And Film Industry Celebrities Birthday Wishes To Allu Arjun - Sakshi

అల్లు అర్జున్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన మెగాస్టార్‌ చిరంజీవి

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్‌. వైవిధ్యమైన కథలు, వరుస హిట్స్‌తో సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల జాబితాలోకి వెళ్లిపోయాడు. తన స్టైల్‌, సూపర్‌ డూపర్‌ డ్యాన్స్‌లతో యూత్‌ ఐకాన్‌గా ఎదిగాడు. తన కట్టె కాలేవరకు మెగాస్టార్‌ చిరంజీవి అభిమానినేనని పేర్కొని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకొని అందరి మనసులను కొల్లగొట్డాడు​. ఆపదవస్తే ఆదుకోడానికి ముందుటాడు.. గుర్తింపు కోసం ఆరాటపడకుండా విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్న అల్లు అర్జున్‌ బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు బన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్‌కు ప్రముఖులు చేసిన ట్వీట్లు మీకోసం..

‘డ్యాన్స్‌లో గ్రేస్‌ ఆ వయస్సు నుంచే ఉంది. బన్నిలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌డే బన్ని. నువ్వు బాగుండాలబ్బా’అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా బన్ని చిన్నప్పటి ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

‘హ్యపీ బర్త్‌డే బన్ని. ఎప్పుడూ నా కోసం ఆలోచిస్తుంటావ్‌. నవ్వు చేసే ప్రతి పని నాకు ప్రేరణ కలిగించేలా ఉంటుంది. ఈ ఏడాది నీకు గొప్పగా సాగాలని కోరుకుంటున్నా’అంటూ అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా వారిద్దరి చిన్నప్పటి ఫోటోను కూడా పోస్ట్‌ చేశాడు. 

‘హ్యపీ బర్త్‌డే అల్లు అర్జున్‌ సర్‌. ‘పుష్ప’ఫస్ట్‌ లుక్‌ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’- రష్మికా మందన

‘యూత్‌ ఐకాన్‌, కష్టపడేతత్వం కలిగిన అల్లు అర్జున్‌ సర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని భారీ హిట్స్‌ సాధించాలని కోరుకుంటున్నాను. నాకు మీరు హీరో, ఫ్రెండ్‌ అయినందుకు ధన్యవాదాలు. లవ్‌ యూ సర్‌’ - హరీష్‌ శంకర్‌

‘హ్యాపీ మ్యూజికల్‌ బర్త్‌డే మా అందరి పుష్ప, స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.  సుకుమార్‌ సోషల్‌ మీడియాకు దూరం కాబట్టి. ఆయన తరుపును కూడా విషెస్‌ తెలుపుతున్నాను. ఇలాగే మాకు వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాను’- సంగీత దర్శకుడు హరీష్‌ శంకర్‌

కాగా, తనకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ తనపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. త్రివిక్రమ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతమందించాడు. పాటలతో పాటు సినిమా కూడా అనేక రికార్డులను కొల్లగొట్టింది. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో బన్ని ‘పుష్ప’చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. 


చదవండి:
పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి
అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement