
దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ రోజు (సెప్టెంబర్ 28న) పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఎంతోమంది సినీ ప్రముఖులు అభిమానులు, అభిమానులు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. అయితే ఒక అభిమాని ఇస్మార్ట్‌గా విషెస్ చెప్పిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో ఆ అభిమాని క్యూబిక్ స్క్వేర్స్‌తో పూరీ బొమ్మ వచ్చేలా చేశాడు. అద్భుతంగా ఉన్న ఆ వీడియోని ఛార్మీ కౌర్ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘ ఇది మైండ్ బ్లోయింగ్. చాలా కష్టమైన దీన్ని ఎలా చేశావో చెప్పు’ అంటూ క్యాప్షన్‌ని దానికి జోడించింది. అయితే అంతకుముందు పూరితో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ‘నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ, మిమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాననే అనుకుంటున్నా’ అని రాసుకొచ్చింది.
అయితే పవన్ కల్యాణ్ హీరోగా ‘బద్రి’తో టాలీవుడ్‌కి పరిచయమైన పూరీ మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తుపోయిన ఆయన డిఫరెంట్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం మహేష్ బాబు హీరోగా చేసిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసింది. కాగా ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
This is mind blowing and extremely tough.. pls tel me how the hell did u do this man 🙉🙆♀️🤩🙏🏻😍🤩#HbdPuriJagannadh pic.twitter.com/i3Xfb2Kq6i
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Comments
Please login to add a commentAdd a comment