Suriya Birthday Special: Chiranjeevi Special Wishes to Suriya Chiranjeevi Wishes to Hero Suriya On His Birthday And Winning National Award - Sakshi
Sakshi News home page

Suriya-Chiranjeevi: సూర్యకు చిరంజీవి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Published Sat, Jul 23 2022 12:22 PM | Last Updated on Sat, Jul 23 2022 12:50 PM

Chiranjeevi Wishes to Hero Suriya On His Birthday And Winning National Award - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన సూర్యకు టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన గజిని, 7th సెన్స్‌, సింగం, ఆకాశమే నీహద్దురా, జై భీమ్‌ చిత్రాలు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందాయి. నేడు సూర్య పుట్ ఇక ఆయన నటించిన సూరరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రం తాజాగా 68వ జాతీయ అవార్డుకు ఎన్నికవడం, నేడు సూర్య బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్‌ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. శనివారం(జూలై 23) సూర్య బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్‌, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

చదవండి: తొలిసారి గ్లామర్‌ షో ఫొటోలు షేర్‌ చేసిన అనుపమ.. నెట్టింట రచ్చ

అంతేకాదు ఈ సందర్భంగా సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకోవడంపై కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం సూర్యకు బర్త్‌డే విషెస్‌తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. “68వ జాతీయ అవార్డు గెలుచుకున్న మై డియర్‌ సూర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మీ పుట్టిన రోజు సందర్భంగా గెలుచుకోవడం మరింత ప్రత్యేకం. మీకు నా జన్మదిన శుభాకాంక్షలు. మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ప్రశంసలు మీరు అందుకోవాలని కోరుకుంటున్నా’ 68వ నేషనల్‌ ఫిలిం అవార్డు అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement