బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఈరోజు 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మంగళవారం(అక్టోబర్ 11న) ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం బిగ్‌బి బర్త్‌డే విషెస్‌తో నిండిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే టాలీవుడ్ మెగాస్టర్ కూడా బాలీవుడ్ మెగాస్టార్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ నటులందరిలో మీరు ఎవరెస్ట్ శిఖరం అంటూ ప్రశంసించారు.
చదవండి: ‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
‘80వ పుట్టిన రోజు శుభకాంక్షలు గురూజీ(బచ్చన్ సార్) మీకు మరింత శక్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ సర్వశక్తవంతుడిని ప్రార్థిస్తున్నా. నటులందరిలో మీరు ఎవరెస్ట్ శిఖరంలా ఉన్నారు. మీ ప్రతిభ, విజయాల పట్ల మేమంతా విస్మయం చెందుతున్నాము. మీకు మరింత శక్తి అమిత్ జీ’ అంటూ చిరు రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రం సమయంలో అమితాబ్ దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.
చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
Happy 80th birthday 💐my beloved Guru ji 🙏@SrBachchan Sir ! May the almighty grant you good health, strength & every wish that you would ever have. You are the Everest among us Artists & we are in eternal awe of your talent & your accomplishments.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2022
More Power to you Amit ji!❤️ pic.twitter.com/JTDfRHzA63
Comments
Please login to add a commentAdd a comment