![In Assembly CM Revanth Reddy Birthday Wishes To Ex CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/17/revanth-reddy-vs-kcr.jpg.webp?itok=Wgw0gfGQ)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సీటులోంచి లేచారు. మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పున్నర్మిణంలో.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని.. ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment