Upasana Konidela Special Birthday Wishes To Husband Ram Charan - Sakshi
Sakshi News home page

Upasana konidela: 'హ్యాపీ హ్యాపీ బర్త్‌ డే బెస్టీ'.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటో

Mar 27 2023 5:35 PM | Updated on Mar 27 2023 7:26 PM

Upasana konidela Special Birthday Wishes To Husband Ram Charan - Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్‌ మీడియాలో సైతం ఆమె యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చెర్రీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేక విషెస్ చెప్పారు. అయితే త్వరలోనే రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

ఉపాసన తన ట్విటర్‌లో రాస్తూ.. ' హ్యాపీ బర్త్‌ డే మై బెస్టీ' అంటూ రామ్ చరణ్‌తో ఉన్న రెండు ఫోటోలను ఆమె పంచుకున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ మరోసారి చరణ్‌ అన్నకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  కాగా.. ఇవాళ రామ్ చరణ్ బర్త్‌ డే సందర్భంగా ఆర్‌సీ 15 చిత్రబృందం డబుల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.  చెర్రీ తాజా చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. శంకర్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన నటిస్తోంది. చెర్రీ బర్త్‌ డేకు రెండు రోజుల ముందే ఆర్‌సీ 15 చిత్రబృందం కేక్‌ కట్‌ చేసి సంబరాలు కూడా చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement