Megastar Chiranjeevi Special Birthday Wishes To Her Mother Anjana Devi, Goes Viral - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మాకు జన్మనిచ్చిన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మెగాస్టార్

Published Sun, Jan 29 2023 3:11 PM | Last Updated on Sun, Jan 29 2023 4:25 PM

Megastar Chiranjeevi Birthday Wishes To Her Mother Anjana Devi - Sakshi

మెగాస్టార్ చిరంజీవికి ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆయనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ అంజనా దేవి పుట్టినరోజు.  ఈ సందర్భంగా చిరంజీవి జన్మనిచ్చిన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అమ్మతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు మెగాస్టార్.

చిరంజీవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మ !' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదిక విషెస్ చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement