Former Cricketer Yuvraj Singh Special Wishes To His Wife Hazel Keech Happy Birthday, Video Viral - Sakshi
Sakshi News home page

Yuvraj Singh: హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్‌: యువరాజ్‌ సింగ్‌

Published Tue, Mar 1 2022 12:02 PM | Last Updated on Tue, Mar 1 2022 12:39 PM

Former Cricketer Yuvraj Singh Wish Wife Hazel Keech Happy Birthday Viral - Sakshi

టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తన భార్య హాజెల్‌ కీచ్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''హ్యాపీ బర్త్‌డే మామా బేర్‌.. కేక్‌లు ఎక్కువగా తినకు.. హ్యాపీ డే ఫర్‌ యూ..'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ రాసుకొచ్చాడు. కాగా యువరాజ్‌తో పాటు మరికొంతమంది హాజెల్‌ కీచ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అందులో ప్రధానంగా హాజెల్‌కు మంచి స్నేహితురాలైన సాగరికా ఘోష్‌ విషెస్‌ చెప్పింది. ''హ్యాపీ బర్త్‌డే హాజెల్‌.. మెనీ మెనీ కంగ్రాట్స్‌.. టేక్‌ కేర్‌'' అంటూ పేర్కొంది. కాగా సాగరికా ఘోష్‌ టీమిండియా మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ భార్య అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాగా యువరాజ్‌, హాజెల్‌ కీచ్‌ 2016 నవంబర్‌ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని యువరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఇక యువరాజ్‌ టీమిండియా తరపున గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్‌ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్‌ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్‌ 10, 2019లో యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: ఒక వైపు కూతురు పోయిన బాధ..ఇప్పుడు తండ్రి మరణం.. శభాష్‌ సోలంకి!

ద‌య‌నీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెట‌ర్‌.. భ‌రోసా క‌ల్పించిన హెచ్‌సీఏ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement