hazel keech
-
నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్ చెప్పిన యువీ!
Yuvraj Singh Hazel Keech Second Baby: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమ కుటుంబంలో కొత్త సభ్యురాలి ఆగమనం గురించి తెలియజేస్తూ అందమైన ఫొటోను షేర్ చేశాడు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న విషయాన్ని శ్రావణ శుక్రవార వేళ ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. మా యువరాణి వచ్చేసింది ఈ మేరకు.. ‘‘మా యువరాణి ఆరా రాక కారణంగా నిద్రలేని రాత్రులను కూడా సరదాగా గడిపేస్తున్నాం. తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని యువీ ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో.. యువీ భార్య హాజిల్ కీచ్ ఒడిలో కొడుకు ఓరియోన్ ఉండగా.. ఈ సిక్సర్ల కింగ్ చిన్నారి కూతురిని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు పట్టిస్తున్నాడు. సిక్సర్ల కింగ్ ఆమె చూపులకు బౌల్డ్ మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్న ఈ దృశ్యం ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు యువీ కుటుంబానికి సంబంధించిన అపురూప ఫొటోను వైరల్ చేస్తున్నారు. కాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కిన యువరాజ్ సింగ్.. బాలీవుడ్ నటి హాజిల్ కీచ్ చూపులకు మాత్రం బౌల్డ్ అయిపోయాడు. నాలుగేళ్లపాటు ఆమె ప్రేమకై నిరీక్షించిన యువీ.. 2016, నవంబరు 30న పెళ్లి బంధంతో ఆమెను శాశ్వతంగా తన మనిషిగా మార్చేసుకున్నాడు. ఈ జంటకు జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. తాజాగా ఆరా రూపంలో కూతురు కూడా రావడంతో వీరిది కంప్లీట్ ఫ్యామిలీ అయింది. చదవండి: Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
'ఎవరీ బుడ్డోడు'.. కన్న కొడుకును గుర్తుపట్టలేకపోయిన యువీ!
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కన్న కొడుకునే గుర్తుపట్టలేకపోయాడు. అదేంటి అని ఆశ్యర్యపోకండి. కేవలం సరదా కోసం మాత్రమే అలా చెప్పాం. విషయంలోకి వెళితే యువరాజ్, హాజెల్ కీచ్ 2016 నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. తన కుమారుడికి ఆరు నెలలు పూర్తవ్వడంతో యువీ భార్య హాజెల్‌కీచ్ కొడుకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) ''అప్పుడే నా బంగారానికి ఆరు నెలలు వచ్చేశాయి. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నీ చేత అమ్మగా పిలిపించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ సిక్స్ మంత్స్ ఓరియెన్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. హాజెల్‌కీచ్ షేర్ చేసిన ఫోటోపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. సానియా మీర్జా మొదలు నీతి మోహన్, యాక్టర్లు సత్యజిత్ దూబే, సాగరికా గాత్కే, క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌లు ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. అయితే యువరాజ్ మాత్రం ''ఎవరీ బుడ్డోడు.. ఎవరి కొడుకు ఇతను ''అంటూ ఫన్నీగా కాప్షన్ పెట్టాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: PAK vs SL: లంక క్రికెటర్‌తో పవాద్ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా! -
హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్: యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''హ్యాపీ బర్త్‌డే మామా బేర్.. కేక్‌లు ఎక్కువగా తినకు.. హ్యాపీ డే ఫర్ యూ..'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ రాసుకొచ్చాడు. కాగా యువరాజ్‌తో పాటు మరికొంతమంది హాజెల్ కీచ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అందులో ప్రధానంగా హాజెల్‌కు మంచి స్నేహితురాలైన సాగరికా ఘోష్ విషెస్ చెప్పింది. ''హ్యాపీ బర్త్‌డే హాజెల్.. మెనీ మెనీ కంగ్రాట్స్.. టేక్ కేర్'' అంటూ పేర్కొంది. కాగా సాగరికా ఘోష్ టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ భార్య అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా యువరాజ్, హాజెల్ కీచ్ 2016 నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఒక వైపు కూతురు పోయిన బాధ..ఇప్పుడు తండ్రి మరణం.. శభాష్ సోలంకి! దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్‌సీఏ View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
Yuvraj Singh: అంగద్‌కు యువీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా!
యువరాజ్ సింగ్.. క్రికెట్ స్కిల్స్‌కే కాదు ప్రేమ కథలకూ ఫేమస్సే! ఆ కథల్లోని ఓ నాయికే హాజెల్ కీష్. బ్రిటిష్ మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్! సినిమా స్టోరీకి తక్కువకాని ఫక్కీలో లవ్ మొదలైంది.. పెళ్లితో శుభమస్తు పలికింది! హాజెల్.. యువరాజ్‌కి పరిచయమయ్యేనాటికే ‘బాడీగార్డ్’ సినిమాతో పాపులర్ అయింది. ఉమ్మడి మిత్రుడి బర్త్‌డే పార్టీలో కలుసుకున్నారు ఈ ఇద్దరూ. చెరగని చిరునవ్వుతో.. అందరితో సరదాగా మాట్లాడుతున్న హాజెల్.. యువరాజ్‌ను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె నవ్వు. ఫిదా అయిపోయాడు. తనతో మాట కలుపుదామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అతణ్ణి పట్టించుకోలేదు. పార్టీ అయిపోయి వీడ్కోలు తీసుకుంటున్న సమయానికి యువరాజ్‌ను గమనించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెను పలకరించాడు. నవ్వింది. మనసంతా నింపుకున్నాడు. ‘బాడీగార్డ్’లో బాచేశావ్’ ప్రశంసించాడు. మళ్లీ నవ్వింది.. ఆ కితాబును స్వీకరిస్తున్నట్టుగా. అంతే యువరాజ్ గాల్లో తేలిపోయాడు. చాలా సందర్భాలను ఉపయోగించుకొని ఆమెతో స్నేహాన్ని కొనసాగించాలని విఫలయత్నం చేశాడు. ఓ ఏడెనిమిదిసార్లు ‘కాఫీ డేట్’కి రమ్మని విన్నవించుకున్నాడు కూడా. ప్చ్.. పెద్దగా ఆసక్తి కనబర్చలేదు హాజెల్. యువరాజ్ డేట్ మాటెత్తినప్పుడల్లా మాట మార్చేసేదట. ‘అన్నిసార్లు అడిగినా మాట దాటవేసే సరికి ఆమె ఇంకెవరితోనైనా ప్రేమలో ఉందేమో అనుకున్నా’ అని చెప్పాడు యువరాజ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇది 2011లో జరిగింది. అప్పుడే.. యువరాజ్ సింగ్‌కు క్యాన్సర్‌కు అని తేలింది. దాన్ని ఎదుర్కొనేందుకు మానసిక శక్తిని కూడగట్టుకునే పనిలో పడ్డాడు అతను. అలా ఓ మూడేళ్లు గడచిపోయాయి. హాజెల్ను మరచిపోలేకపోయాడు యువరాజ్. యథాలాపంగా ఫేస్బుక్ చూసుకుంటుంటే తన ఫ్రెండ్, క్రికెటర్, బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో హాజెల్ కనిపించింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ముందటిలాగే పట్టించుకోలేదు ఆమె. ఆశ్చర్యపోయాడు .. సందేహపడ్డాడు కూడా. ఆ అనుమానంతోనే స్నేహితుడికి చెప్పాడు ‘హాజెల్ను ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా. ఆ అమ్మాయి పట్ల నీకు ఇంకే ఆలోచన ఉన్నా మానుకో’ అని. ‘ఛ..ఛ.. ఆ అమ్మాయి పట్ల నాకెలాంటి ఆలోచనలూ లేవు. ఆమె నాకో మంచి ఫ్రెండ్..అంతే’ అని బదులిచ్చాడు అంగద్. ఓ మూడు నెలల తర్వాత.. యువరాజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది హాజెల్. మళ్లీ డేట్‌కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఓకే అంది. ఉప్పొంగిపోయాడు. ఆమె అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. నవ్వుతూ విన్నది హాజెల్. ఆ ప్రేమ అలా కొనసాగింది నాలుగేళ్లపాటు. ఒకసారి బాలీ వెళ్లిందీ జంట. అక్కడ ఆ సముద్రతీరంలో హాజెల్ను అడిగాడు యువరాజ్ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యం హాజెల్‌కు. నవ్వింది.. ఆమె కళ్లు కూడా నవ్వాయి.. ఆనందం, ఉద్వేగపు తడిని చిప్పిల్లుతూ. అప్పుడు .. అక్కడే.. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు యువరాజ్. ‘తనను పెళ్లికి ప్రపోజ్ చేసేప్పుడు నెర్వస్ ఫీలయ్యా చాలా. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. టీన్స్‌లో అయితే అది సాధ్యమేమో కానీ.. కొంత వయసొచ్చాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది ఉంటుంది అని నేనైతే అనుకోను’ అంటాడు యువరాజ్ సింగ్. హాజెల్ కోసం నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంపిక చేయడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించారట యువరాజ్ సింగ్, వాళ్లమ్మ షబ్నమ్ సింగ్. 2016, నవంబర్ 30న చండీగఢ్‌లో ఈ జంటకు పెళ్లయింది. ఆ సందర్భంగా షబ్నమ్ సింగ్! ‘మొత్తానికి మా వాడికి సరైన అమ్మాయే దొరికింది’ అంటూ తన సంతోషాన్ని ప్రకటించింది. యువరాజ్ సింగ్ జీవితం ఊహించని మలుపులమయం. క్రికెటర్‌గా సక్సెస్ఫుల్.. క్యాన్సర్‌నీ జయించాడు. ప్రియుడిగా ఓడిపోయిన అతణ్ణి తన ప్రేమతో గెలిపించి.. చక్కటి భర్తగా నిలబెట్టింది హాజెలే. ఇటీవలే వీరికి బాబు జన్మించాడు. -ఎస్సార్ చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్రెడీ పెళ్లైన టెన్నిస్ స్టార్‌తో నటి వివాహం -
తండ్రైన యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ తన ట్విటర్లో స్వయంగా వెల్లడించాడు."నా అభిమానులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఒక శుభవార్త. మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు కాగా 2016లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్‌ల వివాహమైన సంగతి తెలిసిందే. ఇక 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో యువీ పాత్ర మరువలేనిది. చదవండి: Legends League Cricket 2022: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే ❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe — Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022 -
అవును షాకింగే, వీడ్కోలు పలుకుతున్నా: నటి
టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం నాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వెల్లడించింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్ చేయొద్దని కోరింది. "నేను, నా ఫోన్ బ్రేక్ తీసుకుంటున్నాం.. ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు! పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకురావాలంటే ఇలాంటి బ్రేక్స్ తీసుకోవాల్సిందే.. కాబట్టి సోషల్ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ సోషల్ మీడియాలో మీ అందరినీ పలకరిస్తాను. అయితే అది అంత తొందరగా కాదులెండి. కనుక ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్‌కు బదులు ఫోన్ చేయండి" అంటూ ఓ లేఖను షేర్ చేసింది. దీంతో కొందరు అభిమానులు ఆమె తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమె బాగానే ఉంది కదా! అంటూ ఆందోళన చెందుతున్నారు. View this post on Instagram A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో నటించిన హజెల్ కీచ్ 2007లో తమిళ చిత్రం 'బిల్లా'లో ఓ ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. సల్మాన్ ఖాన్ 'బాడీగార్డ్'లోనూ ఓ పాత్రలో నటించింది. 'మాక్సిమమ్' చిత్రంలో 'అ అంటే అమలాపురం..' పాటకు చిందేసింది. కాగా హజెల్ క్రికెటర్ 2011లో తన ఫ్రెండ్ బర్త్‌డేపార్టీలో యువరాజ్ సింగ్‌ను కలిసింది. వీళ్లిద్దరూ 2014లో స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో చండీగఢ్‌లో 2016 నవంబర్ 30న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చదవండి: సల్మాన్‌ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ? యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు స్టార్ హీరోతో సినిమా.. రష్మిక అవుట్ -
యువీ ట్వీట్: మాజీ లవర్ రియాక్ట్
ముంబై : టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులతో పాటు తాజా, మాజీ క్రికెటర్లు అతడిని స్మరించుకున్నారు. అంతేకాకుండా ‘మిస్ యూ యూవీ’ అంటూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. దీంతో యువీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా తనను గుర్తుచేసుకున్న అభిమానులకు యువీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. (నాపై నమ్మకం కల్గించావు: యువీ) ‘డియర్ ఫ్యాన్స్ మీ ప్రేమకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్‌పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి. అవసరంలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయండి’ అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అయితే యువీ ఉద్వేగంగా చేసిన ఈ పోస్ట్‌పై అతడి మాజీ లవర్ కిమ్ శర్మ రియాక్ట్ అయ్యారు. ‘గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అంటూ కామెంట్ చేశారు. కాగా, యువీ-కిమ్‌ల మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగిన విషయం తెలిసిందే. అయితే 2007లో వీరి లవ్‌స్టోరీకి ఫుల్స్టాప్ పడింది. (ట్రెండింగ్‌లో సిక్సర్ల ‘యువరాజు’) తన భర్త అలీ పుంజానీతో కిమ్ శర్మ కిమ్‌తో పెళ్లికి యువీ తల్లి ఒప్పుకోలేదని, కిమ్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారనే వార్తలు వచ్చాయి. 2010లో కెన్యా వ్యాపారవేత్త అలీ పుంజానీని కిమ్ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో ‘అవును, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆమే నా ప్రేమ. అయితే, ఇప్పుడు ఆమెకు పెళ్లైంది. ఇప్పుడామె గురించి మాట్లాడటం సరికాదు’ అంటూ యువీ వ్యాఖ్యానించడం విశేషం. ఇక నాలుగేళ్ల కిందట హాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను యువీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక గతేడాది యువీ ఇచ్చిన రిటైర్మెంట్ పార్టీకి కిమ్ హాజరయ్యారు. అనంతరం యువీ, హజెల్ కీచ్‌ల జీవితాల్లో వెలుగులు నిండాలి అంటూ ట్వీట్ చేశారు. కిమ్ శర్మ తెలుగు అభిమానులకు సుపరిచితమే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ చిత్రంలో హీరోయిన్గా నటించారు. View this post on Instagram ❤️ A post shared by Yuvraj Singh (@yuvisofficial) on Jun 10, 2020 at 3:19am PDT -
మూడేళ్లు కాదు.. 30 ఏళ్లు: యువీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్-హజల్ కీచ్లు వివాహం జరిగే మూడేళ్లు అయ్యింది. 2016, నవంబర్ 30వ తేదీన వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్ 30) భార్య హజల్ కీచ్‌కు యువరాజ్ విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘ శుభాకాంక్షలు భార్యామణి గారూ.. మనకు పెళ్లి జరిగి మూడేళ్లే అయ్యింది.. కానీ నాకు మాత్రం ముప్పై ఏళ్లు అయినట్లుంది. హ్యాపీ యానివర్సరీ మై లవ్’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనికి హజల్కీచ్తో కలిసి ఉన్న అందమైన ఫోటోను యువరాజ్ షేర్ చేశాడు. యువరాజ్ పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలిపిన వారిలో కేవలం ఫ్యాన్సే కాకుండా పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా యువరాజ్‌కు అభినందనలు తెలియజేశారు. ‘ కంగ్రాట్స్ పాజీ అండ్ హజల్కీచ్’ అని శిఖర్ ధావన్ చెప్పగా, ‘ మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ హర్భజన్ విషెస్ తెలిపాడు. ‘ సో క్యూటీ’ అంటూ డేవిడ్ వార్నర్ కూడా అభినందనలు తెలియజేశాడు. ఇక బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌తో పాటు బిపాసా బసూ, సునీల్ గ్రోవర్లు సైతం యువీకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో యువరాజ్ పాల్గొన్నాడు. మరాఠా అరేబియన్స్‌కు యువరాజ్ ప్రాతినిథ్యం వహించగా అతని జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ను ఓడించిన మరాఠా అరేబియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత యువరాజ్ సింగ్ దేశవాళీ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా గ్లోబర్ టీ20 కెనడా లీగ్‌లో సైతం యువరాజ్ పాల్గొన్నాడు. -
యూవీని మిస్ అవ్వను..
హిమాయత్‌నగర్: యువరాజ్ సింగ్.. ఇండియన్ క్రికెట్లో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న అందమైన ఆటగాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత హైదరాబాదీలను అంతగా ఆకట్టుకున్న క్రికెటర్ యూవీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్ పట్టి క్రీజ్‌లోకి వస్తే చాలు ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ వీర బాదుడికి బంతులు బౌండరీలు దాటితే ప్రత్యర్థుల గుండెల్లో స్కోర్ బోర్డుపరుగులు పెట్టాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూవీ.. తను ఆడే ఆటకు, బాదే షాట్స్‌కి, సిక్స్‌లకు కోట్ల మంది ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. యూవీపై అభిమానంతో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్‌ను నేర్చుకున్న సిటీలోని కొందరు క్రికెటర్లు, అతడి ఆట తీరును అభిమానించే మరికొందరు ఇప్పుడు యువరాజ్ రిటైర్మెంట్ను జీర్ణించుకోలేకపోతున్నారు. సిటీ వచ్చినప్పుడుఆడిన ఆట తీరు, రికార్డ్స్, రిటైర్మెంట్పై అభిమానులు తమ మనసులోని మాటను ‘సాక్షి’తో పంచుకున్నారు. ♦ ఎల్బీ స్టేడియంలో 16–03–2002లో జింబాబ్వేపై ఆడిన మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. ♦ ఇదే ఎల్బీ స్టేడియంలో న్యూజ్లాండ్పై 15–11–2003లో జరిగిన మ్యాచ్‌లో సాధించింది ఏడు పరుగులే అయినా ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. ♦ ఉప్పల్‌లో స్టేడియం నిర్మించాక తొలి మ్యాచ్ 16–11–2005లో సౌతాఫ్రికాపై యూవీ 103 పరుగులు సాధించాడు. ♦ చివరిగా 5–11–2009లో ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఆడాడు. ♦ ఐపీఎల్(2016)లో యువరాజ్ సన్‌రైజర్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేతగా ఆ ఏడాది మే 29వ తేదీన కప్పును అందుకున్న యూవీ.. ‘హైదరాబాద్ నాకు చాలా ప్రత్యేకం’ అంటూ ఉద్విగ్నంగా చెప్పాడు. ♦ 2017లో ఏప్రిల్ 5న రాయల్స్ చాలెంజర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. 27 బంతులకు 62 పరుగులు సాధించి హైదరాబాదీలను ఉర్రూతలూగించాడు. యూవీని మిస్ అవ్వను చిన్నప్పటి నుంచి యూవీ ఆట చూసి పెరిగాను. నాకు యూవీ అంటే చాలా ఇష్టం. 2007–2011 ప్రపంచకప్‌ను యూవీ కోసం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూశాను. యూవీ ఓ మంచి ఆటగాడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. 2003లో ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో ఇంగ్లాండ్‌పై మహ్మద్ కైఫ్‌తో కలిసి టీమ్‌ని గెలిపించిన విజువల్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. భారత్ జట్టు కోసం ఎన్నో విజయాలను ఇచ్చిన యువరాజ్ ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడు. అటువంటి వ్యక్తి రిటైర్మెంట్ అవడం బాధగా ఉంది. మరోపక్క ఆయనకు మంచి ఫేర్వెల్ ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.– హనుమా విహారి, ఇండియన్ క్రికెటర్ కమిట్మెంట్ ఉన్న ఆటగాడు భారత్ జట్టుని గెలిపించాలనే కమిట్మెంట్ ఉన్న ఆటగాడు యూవీ. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో తను వందశాతం పర్ఫెక్ట్గా ఆడేవాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతను ఫ్రంట్‌కు వచ్చి కొట్టే సిక్స్‌లకు నేను ఫిదా. యూవీని అనుసరిస్తూ పెరిగాను, ఆట నేర్చుకున్నాను. ఇప్పుడు అతను రిటైర్ అవడం తట్టుకోలేకపోతున్నాను.– ప్రతీక్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అతడి సిక్స్‌లకు ఫిదా యూవీ ఫ్రంట్‌కు వచ్చి కొట్టే సిక్సెస్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. యూవీ వీడియోస్‌ని యూట్యూబ్‌లో డౌన్లోడ్ చేసుకుని స్టేటస్లు పెడుతూ నా ఫ్రెండ్స్‌ని సతాయిస్తుంటా. అతడంటే అంత పిచ్చి నాకు. ప్రపంచకప్‌లో తన సత్తాను చాటి నాలాంటి ఫ్యాన్స్‌కు మజా ఇస్తాడనుకున్నా. కానీ యూవీ రిటైర్మెంట్ ప్రకటనతో షాకయ్యా.– రాగిణి కుమారి, యూవీ ఫ్యాన్ చాలా బాధగా ఉంది నేనూ యూవీ ఫ్రెండ్స్. నేను క్రికెట్ కోసం చండీగఢ్ ఇండియా క్యాంప్‌లో ఉన్నప్పుడు అక్కడకి యూవీ వాళ్ల నాన్నతో కలసి వచ్చేవాడు. మంచి మనసున్న వ్యక్తి. తక్కువ సమయంలో మేమిద్దరం మిత్రులయ్యాం. ఆ టైంలో హైదరాబాద్ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకునేవాడు. క్రికెట్‌పై యూవీకి ఉన్న పట్టుదల, ప్రేమ ప్రత్యేకం. ఇప్పుడు ప్రపంచకప్ పొటీల్లో నా ఫ్రెండ్ లేకపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది.– శ్రీకాంత్, యూవీ ఫ్రెండ్, క్రికెటర్ లెఫ్ట్‌హ్యాండ్ నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి యూవీ ఆట చూసి పెరిగాను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా అతడు కొట్టే షాట్స్‌కి నేను ఫిదా. అందుకే ఆయనలా ఆడాలని నేను కూడా లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్ నేర్చుకున్నాను. కొన్ని సందర్భాల్లో నేను కొట్టే షాట్స్ యూవీలా ఉన్నాయంటూ మా ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడే రిటైర్ అవ్వకుండా వరల్డ్‌కప్ ఆడితే బాగుండేది.– చార్లెస్, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆటగాడు... అందగాడు యువరాజ్ మంచి ఆటగాడే కాదు.. అందగాడు కూడా. అతను సిటీకి వచ్చినప్పుడల్లా కలవాలనే ప్రయత్నించేదాన్ని కానీ కుదరలేదు. వన్డే, టెస్ట్, ఐపీఎల్ ఏదైనా సరే.. యూవీ బ్యాటింగ్‌కు దిగాడంటే చాలు టీవీ ముందు నుంచి కదలను. అంతమంచి ఆటగాడి ఆటను ప్రపంచకప్ పోటీల్లో చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది.– సాహితి, యూవీ అభిమాని కేన్సర్ రోగుల కోసం.. యూవీకి హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. కేన్సర్ రోగులకు సాయం చేసేందుకు తాను స్వయంగా ‘యూవీ కెన్’ అనే పేరుతో ఓ స్పోర్ట్స్ స్టోర్‌ను పంజగుట్టలోని సెంట్రల్ మాల్లో 2018లో ప్రారంభించారు. క్రీడా పరికరాలు, దుస్తులు వంటి వాటిని అమ్మి తద్వారా వచ్చిన డబ్బును కేన్సర్ పేషెంట్లకు ఇస్తున్నట్లు దాని ప్రారంభోత్సవంలో యూవీ చెప్పడం ఎవరూ మరిచిపోలేదు. -
లవ్ యూ షాబూ : యువీ భార్య హాజిల్
నా జీవితంలో మొదటిసారి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకుంటున్నా.. ఇందుకు సహకరించిన మా అత్తగారికి ధన్యవాదాలు అంటూ నటి, క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హాజిల్ కీచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. తనను ఎల్లవేళలా తల్లిలా కనిపెట్టుకుని ఉంటున్న యువీ తల్లి షబ్నమ్ సింగ్‌కు ముందుగానే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఇక.. తన ముక్కుకు సర్జరీ జరిగిన కారణంగానే ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని..ఇకపై అభిమానులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. లవ్ యూ షాబూ!! ‘ఇన్నాళ్లుగా ఎక్కడ దాక్కున్నానా అని ఆశ్చర్యపోయారు కదా. గత నెలలో నా ముక్కుకు సర్జరీ జరిగింది. ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యను అధిగమించేందుకు మా అత్తగారు సహకరించారు. ముద్దుగా కోప్పడి మరీ నన్ను సర్జరీకి తీసుకువెళ్లారు. ఇలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం. అంతర్గతంగా తలెత్తిన సమస్యల వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. షాబూ పుణ్యమాని ప్రస్తుతం జీవితంలో మొదటిసారిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నా. ఈ క్రమంలో డైట్ నిర్లక్ష్యం చేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కాస్త లావయ్యాను. అందుకే ఫొటోలు అప్లోడ్ చేయలేదు. కానీ జీవితం ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. ఆరోగ్యంగా జీవించడమే ముఖ్యం కదా. లవ్ యూ షాబూ! హ్యాపీ మదర్స్ డే అంటూ షబ్నమ్ సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను హాజిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ మంచి భార్యగా గుర్తింపు పొందిన మీరు లావయ్యానని బాధ పడకండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ అత్తగారితో ఉన్న అనుబంధం గొప్పది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram I’ve not posted in a while so i thought i would fill you in on where Ive been hiding (those of you who were wondering)... A month ago i had a surgery to fix my nose- for as long as i can remember ive struggled to breath through my nose, although not a serious health issue, a chronic one that i just learnt to live with... Lucky enough for me it annoyed my mother-in-law so much that she finally took me to a hospital, 🤪🤣 because of which we came to know just how much internal damage there was and understood the problem! So thanks to her i have a new nose👃🏼(internally) and for the first time in my life i can now breath freely and easily. Due to the surgery i’ve not been active or able to exercise yet, so I’ve put on some weight hence staying away from social media! But fuck it, here i am, better than ever, breathing happily, all thanks to my mother in law who’s receiving blessings from me everyday because finally, finally I CAN BREATHE!!!! It goes to show you, you never know what can lead to where, the things we live with and consider “normal” and sometimes it takes annoying someone to have the best outcome!!!! Love you Shabo! Happy belated mothers day ❤️ A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on Apr 1, 2019 at 6:22am PDT -
యువీ భార్య హాజిల్ కీచ్ భావోద్వేగం
మొన్నటిదాకా ఫిట్నెస్, కీకీ వంటి చాలెంజ్‌లతో ఇంటర్నెట్లో హల్చల్ చేసిన నెటిజన్లు ప్రస్తుతం #10ఇయర్స్‌చాలెంజ్ అనే సరికొత్త సవాల్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం ఎలా ఉన్నాం, గతంతో పోలిస్తే ఇప్పుడు మనలో వచ్చిన మార్పులేంటి తదితర అంశాలను ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, బిపాసా బసు, శృతి హాసన్‌లు ఇప్పటికే ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. నటి, క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హాజిల్ కీచ్ కూడా ఈ జాబితాలో చేరారు. ఉపవాసం ఉండేదాన్ని! ‘22 నుంచి 32 ఏళ్లు.. ఇంత దూరం ప్రయాణించానా! అప్పుడు డిప్రెషన్‌ను జయించేందుకు యుద్ధం చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని, జుట్టుకు చిక్కగా రంగేసుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని. వారిని సంతోషంగా ఉంచేందుకు బాధలన్నీ పంటిబిగువనే భరించాను. కానీ ఈరోజు పూర్తి విశ్వాసంతో మాట్లాడగలను. ఎవరు ఏమనుకుంటారోనన్న భయం లేదు. ఇప్పుడు ధైర్యంగా జుట్టు కత్తిరించుకుంటున్నా. నా సంతోషం కోసమే నేను బతుకుతున్నా. ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ కనీసం ఊహించలేదు. 10ఇయర్స్‌చాలెంజ్ మొదలుపెట్టిన వారికి కృతఙ్ఞతలు’ అంటూ హాజిల్ కీచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. దీంతో.. ‘భయాన్ని’ జయించిన మీలాంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు మాకు ఆదర్శం’ అని నెటిజన్లు.. హాజిల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram Here is my #10yearchallenge 22 years VS almost 32 years.... and how far I’ve come! I was battling depression, starving myself, had bulimia, dyed my hair dark and kept it long trying to fit in a please everyone around me but hiding all the pain with a smile and joke so no one knew. Today, i can confidently talk about what I’ve gone through, i dont care what others think of me, i finally had the courage to cut my hair, i dont try and fit in anymore and i am happier, healthier and more at peace with myself than i ever imagined i could be! Wahooo #personalcelebration thanks whoever started the 10 year challenge ❤️ A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on Jan 16, 2019 at 2:39am PST -
‘యువరాజ్ లోపం అదే’
సాక్షి, హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆటగాడు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. కానీ జట్టులోకి వచ్చి తీరుతానని.. పునర్వైభవం సాధిస్తానని యువీ నమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలో బ్రిటీష్ మోడల్, యువీ సతీమణి హేజిల్ కీచ్ తన భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువీ గురించి, వివాహ జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘యువీ ఒకరిని మాట అనడు, విమర్శించడు ఆ గుణమే నాకు చాలా నచ్చింది. కానీ అదే అతడికి అతిపెద్ద డ్రాబ్యాక్. జట్టులో స్థానం కాపాడుకోవాలన్నా, సుస్థిరం చేసుకోవాలన్నా ఆ రెండూ అవసరమే’ అన్నారు. యువీ గురించి ఇంకా ఏమన్నారంటే.. ‘యువీ మంచి మనసున్న వ్యక్తి. ప్రతీ ఒక్కరిలోనూ ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తిస్తాడు. కానీ వారిలోని చెడు స్వభావం గురించి ఆలోచించడు, పట్టించుకోడు. ప్రస్తుత పిరిస్థితుల్లో యువీ అంత మంచిగా ఉంటే కుదరదు. జట్టులో చోటు దక్కడం లేదని ఎప్పుడూ బాధ పడడు. ఇప్పటికే క్రికెట్లో తానేంటో నిరూపించుకున్నాడు. మరోసారి అవకాశం వస్తే తన ఆటతీరుతో అందరికీ సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాడు. మా వివాహం జరిగిన కొద్ది రోజులకే యువీకి తిరిగి టీమిండియాలో చోటు దక్కింది. విదేశీ టూర్ల నేపథ్యంలో చాలా నెలలు యూవీని చూసే వీలు లేకుండాపోయింది’అంటూ హేజిల్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. (సింగ్ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!) యువీ చివరగా ఆడింది.. ఇప్పటివరకు భారత్ తరపున యువరాజ్ సింగ్ 304 వన్డేలాడి 8,701 పరుగులు చేశాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్‌లతో పాటు 58 టీ20 మ్యాచ్‌లాడాడు. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుని సైతం అందుకున్నాడు. 2011లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా సాధించాడు. భారత్ తరుపున యువరాజ్ సింగ్ చివరగా 2017 జూన్ 30న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన యువరాజ్.. చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, జట్టులో చోటు దక్కించుకోవాలంటే ముందుగా అతడు యో-యో టెస్టులో పాసవ్వాలి. గతంలో పలుమార్లు యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇక, భారత జట్టులో యువీకి చోటు దక్కడం కష్టమేనని క్రికెట్ పండుతులు అభిప్రాయపడుతున్నారు. (అందుకు ఎన్సీఏనే కారణం: యువీ) చదవండి: అంతదాకా చూస్తా... ఆ తర్వాతే గుడ్‌బై! -
యువీని భయపెట్టే బౌలర్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు వణుకుతారు. అతడికి బౌలింగ్ చేయడానికి తటపటాయిస్తారు. ముఖ్యంగా ఇంగ్లీషు బౌలర్లు యువీ అంటే హడలిపోతారు. బౌండరీ, సిక్సర్లతో నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడే ఈ ఎడమచేతి బ్యాట్స్ మన్ తన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2007 ట్వంటీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదడడం యువీ కెరీర్ లో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్-10లో హైదరాబాద్ తరపున ఆడుతున్న తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అయితే తనను భయపెట్టే ఇంగ్లీషు బౌలర్ ఒకరు ఉన్నారని యువీ వెల్లడించాడు. గౌరవ్ కపూర్ షో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో అతడీ విషయం వెల్లడించాడు. తాను ఎదుర్కొనలేని ఏకైక ఇంగ్లీషు బౌలర్ తన భార్య హజల్ కీచ్ అని సరదాగా చెప్పాడు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆమె సంధించే బౌన్సర్లకు తన దగ్గర సమాధానం లేదని అన్నాడు. ఆమె బౌలింగ్ లో ఆడడం చాలా కష్టమన్నాడు. తనింట్లో ఆమే అంపైర్ అని వెల్లడించాడు. ఐపీఎల్ లో సత్తా మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని యువరాజ్ భావిస్తున్నాడు. -
యువీ గురించి భార్య కామెంట్.. లైకుల వెల్లువ
కటక్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ వీరవిహారం గురించి తెలియనివాళ్లు ఉండరు. కేవలం 127 బంతుల్లోనే 150 పరుగులు చేసి విజృంభించిన యువీ.. తన చిరకాల మిత్రుడు ధోనీతో కలిసి బ్రిటిష్ బౌలర్లను చితకబాదేశాడు. రెండు నెలల క్రితమే యువీని పెళ్లి చేసుకున్న హేజిల్ కీచ్ ఈ ఇన్నింగ్స్‌ను చూసి చాలా ముచ్చట పడిపోయారు. ఆమె ఈ విషయమై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరికీ విపరీతంగా నచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ బ్యాటింగ్ ఫొటోతో ఆమె పెట్టిన కామెంటుకు ఇప్పటికి 25వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అతడి మధ్యపేరు 'ఫియర్స్' అయి ఉండాలని హేజిల్ కీచ్ చెప్పారు. తన భర్త ఇప్పుడు ఇంగ్లండ్ పైన, గతంలో కేన్సర్‌పైన చేసిన పోరాటం గురించి ఆమె వివరించారు. ''127 బంతుల్లో 150 పరుగులు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌లో ఇండియా 2-0 తో గెలిచింది. కేన్సర్‌ను ఓడించి అతడు తిరిగి రావడాన్ని మర్చిపోలేం. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడై, ఫిట్నెస్ సాధించి, కెమోథెరపీ తర్వాత కూడా మళ్లీ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు'' అని ఆమె కామెంట్లో రాశారు. ఆమె షేర్ చేసిన ఫొటోకు, రాసిన కామెంట్లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సామాన్యుడికి ఇది సాధ్యం కాదని, యువరాజ్ మాత్రమే దాన్ని సుసాధ్యం చేసి చూపించాడని ఒకరు అంటే, నిజంగా నిజం హేజిల్.. అతడో హీరో.. అతడికి సెల్యూట్ చేస్తున్నా అని మరో యూజర్ కామెంట్ రాశారు. పలువురు సెలబ్రిటీలు కూడా యువరాజ్ పునరాగమనంతో పాటు బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడటంపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్, క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, గంగూలీ, హర్భజన్, నటులు రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధవన్ తదితరులు యువీ, ధోనీలను ఆకాశానికెత్తేశారు. "Fierce" should be his middle name. 150 runs from 127 balls, Man of the Match, India won 2-0 against England in ODIs. Not forgetting coming back from CANCER, getting his health and fitness back post chemo therapy and finally being in the ODI team after all of that. Throw in a wedding somewhere. That, ladies and gentleman, it what it looks like to never give up. Theres the difference in surviving cancer and beating cancer #doitagain #takeyourlifeback #YuvrajFierceSingh #hero #ywc @yuvisofficial A photo posted by HazelKeechOfficial (@hazelkeechofficial) on Jan 19, 2017 at 12:57pm PST -
హనీమూన్‌లో యూవీ దంపతులు..!
గతవారం ఓ ఇంటివారు అయిన క్రికెటర్ యువరాజ్ సింగ్-హజెల్ కీచ్ దంపతులు ప్రస్తుతం ప్రణయయాత్రలో మునిగితేలుతున్నారు. పేరు వెల్లడించిన ప్రదేశంలో బీచ్ తీరంలో ఈ జంట హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. నీలి సముద్రపు అలలు, ఇసుకతిన్నెలు, తళతళ మెరిసే ఎండలో విహరిస్తూ ఈ జంట కొన్ని ఫొటోలను తమ అభిమానులతో పంచుకుంది. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అయిన హజెల్ కీచ్‌ను గత నెల 30న యువీ పెళ్లాడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట డిసెంబర్ 12న ఈ స్టైలిస్ క్రికెటర్ 35వ వసంతంలో అడుగుపెట్టాడు. పుట్టినరోజు సందర్భంగా యూవీని సాటి క్రికెటర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనల్లో ముంచెత్తారు. అయితే, తన పుట్టినరోజును తన భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, తాము హనీమూన్ స్వర్గంలో మునిగితేలుతున్నా హజెల్ కీచ్ ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. -
ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..
-
ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..
టీమిండియా ఆల్ రౌండర్, కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ మాంచి జోష్ మీదున్నాడు. బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ను సిక్కు, హిందు సంప్రదాయం ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్న యువరాజ్ డాన్స్‌లతో అదరగొడుతున్నాడు. అవకాశం, సందర్భం రావడం ఆలస్యమన్నట్టు చెలరేగిపోతున్నాడు. శుక్రవారం గోవాలో యువీ, హజల్లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. కాగా పెళ్లికి ముందు గోవా ఎయిర్‌పోర్టులో యువీ, హజల్లు డాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ జోడీ పోటీపడి భాంగ్రా డాన్స్ చేశారు. గోవాలో జరిగిన పెళ్లికి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. గత బుధవారం చండీగఢ్ సమీపంలో యువీ, హజల్ సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం హజల్ కీచ్ తన పేరును గుర్బసంత్ కౌర్‌గా మార్చుకుంది. ఈ వేడుకల్లో నూతన వధూవరులు డాన్స్‌లతో అతిథులను కనువిందు చేశారు. వీరితో కలసి విరాట్ కోహ్లీ కూడా చిందేశాడు. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. -
మరోసారి పెళ్లి చేసుకున్న యువరాజ్
టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హజల్ కీచ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత బుధవారం చండీగఢ్ సమీపంలో యువీ సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కాగా శుక్రవారం గోవాలో యువీ, హజల్లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. హజల్ కీచ్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి బ్రిటన్ వాసి. హజల్ తల్లి బిహార్‌కు చెందిన హిందువు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువీ, హజల్‌ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హాజరవుతున్నట్టు సమాచారం. సిక్కుల సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి కోసం హజల్ కీచ్ పేరును మార్చుకుంది. బాబా రామ్ సింగ్ డేరాలో యువీ, హజల్‌ల వివాహం జరిగింది. ఈ వేడుకల్లో హజల్ కీచ్ పేరును గుర్బసంత్ కౌర్‌గా సంబోంధించారు. పెళ్లికి హాజరైన అతిథులు తొలుత షాక్ తిన్నా తర్వాత విషయం తెలుసుకున్నారు. యువరాజ్, అతని తల్లి షబ్నం.. బాబా రామ్ సింగ్‌ను ఆరాధిస్తారు. దీంతో మతపెద్దల సూచన మేరకు హజల్ కీచ్ పేరును మార్చినట్టు సమాచారం. -
వావ్! వారి పెళ్లి ఫస్ట్ ఫొటోలు వచ్చేశాయ్!
భారత స్టైలిష్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన జీవితంలో కొత్త ఇన్సింగ్స్ ఆరంభించాడు. క్రికెట్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడిన ఈ క్రికెటర్ బుధవారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. చండీగఢ్‌లోని గురుద్వారలో బాలీవుడ్ నటి హజెల్ కీచ్-యువీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు మంగళవారం యూవీ వివాహ వేడుకల్లో భాగంగా సంగీత్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాంగ్రా స్టెప్పులతో యూవీ అదరగొట్టాడు. యూవీ వివాహ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులైన విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, పార్థీవ్ పటేల్, రహానే తదితరులతోపాటు, భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. సినీ ప్రముఖులు పలువురు కొత్త జంటను ఆశీర్వదించారు. -
యువరాజ్ పెళ్లిపై ఆ ప్రభావం లేదు
న్యూఢిల్లీ: ఈ నెల 8న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాక ప్రజలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. వివాహ కార్యక్రమాలను ముందే నిశ్చయించుకున్నవారికి మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వివాహంపై లేదట. పాతనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించకముందే యువరాజ్ పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 30న యువీ నటి హజెల్ కీచ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. యువీ తన స్థాయికి తగ్గట్టు డబ్బు ఖర్చు పెట్టకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటున్నాడు. యువీ తండ్రి యోగరాజ్ సింగ్ ఈ విషయం చెప్పాడు. ‘పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం దాచుకున్న వారికే సమస్య. యువీ పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని భావించినట్టయితే కరెన్సీతో సమస్యలు వచ్చేవి. మా కుటుంబం ఎప్పుడూ సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తుంది. దేశంలో చాలామంది పేదలున్నారు. పెళ్లికి అనవసరంగా భారీగా ఖర్చు చేయడం కంటే ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తే బాగుంటుంది. యువీ పెళ్లికి స్నేహితులు, క్రికెటర్లు సహా అత్యంత సన్నిహితులైన 60 మంది మాత్రమే వస్తారు. ఒకేరోజు సంగీత్, మెహందీ, రిసెప్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తాం’ అని యోగరాజ్ అన్నాడు. -
పెళ్లి వేళ యువరాజ్ చిన్న పొరపాటు
న్యూఢిల్లీ: మరో వారంలో ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెట్ ప్రముఖ ఆటగాడు యువరాజ్ సింగ్ పెళ్లి వేళ చిన్న పొరపాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెళ్లి ఆహ్వాన పత్రికపై తప్పుగా ప్రచురించడాన్ని గుర్తించలేకపోయారు. ప్రధాని నరేంద్రమోదీ అని కాకుండా ప్రధాని (నరేందర్ మోదీ) అంటూ అక్షర దోషంతో ఉన్న ఆహ్వాన పత్రికతో ఆయన పార్లమెంటు వద్ద కనిపించారు. అటుగా వెళుతున్న యువీని ఆయన చేతిలోని పెళ్లి కార్డును చూసిన విలేకర్లు వెంటనే తమ చేతుల్లోని కెమెరాలకు పని చెప్పగా ఆ కార్డుపై ప్రధాని మోదీ పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించి ఉంటారు. అయితే, వీరేందర్ సెహ్వాగ్‌తో కలిసి సహవాసం చేసిన యువీపై ఆ పేరు ప్రభావం పడి వీరేందర్ మాదిరిగా నరేందర్ అని రాసి ఉంటాడేమో అని కొందరు భావిస్తున్నారు. అయినా పెళ్లంటే హడావుడి బిజీ బిజీగా ఉంటారు. ఈ వేళలో ఏ అంశంపైనా కుదురుగా ఉండలేరు.. దేని గురించి పెద్దగా పట్టించుకునే తీరిక ఉండదు. ఇలాంటి సమయాల్లోని చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమేలే అని మన యువీ ఫ్యాన్స్ అంటున్నారు. హాలీవుడ్ నటి, మోడల్ హజల్కీచ్తో యువీ ఈ నెల 30న ఏడడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన వివాహాని దేశంలోని అగ్రనాయకులను సెలబ్రిటీలను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. -
కాబోయే భార్యతో యువరాజ్ షికార్లు
న్యూఢిల్లీ: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, తనకు కాబోయే భార్య హాజల్ కీచ్‌తో ప్రివెడ్డింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి సన్నిహితులకు స్పెషల్ డిన్నర్ ఇచ్చారు. సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్, డిజైనర్-నటి పెర్నియా ఖురేషీ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. యువీ-కీచల్ హోటల్ నుంచి బయటకు వస్తూ మీడియా కెమెరా కంట పడ్డారు. నలుపు రంగు డ్రెస్, నీలం రంగు జాకెట్ ధరించిన హాజల్ కీచ్.. యువీ చేతిలో చేయి వేసి నడుస్తూ బయటకు వస్తున్న ఫొటోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యువరాజ్ నల్లరంగు టీషర్ట్, తెలుగు రంగు పాంట్ దుస్తులు ధరించి తలకు హెయిర్ బాండ్ పెట్టుకున్నాడు. ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఆనందంగా హోటల్ నుంచి బయటకు రావడాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఫొటో గ్రాఫర్ వారిందర్ చావ్లా క్లిక్ మనిపించాడు. నవంబర్ 30న చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయంలో యువీ- హాజల్ కీచ్ పెళ్లి సిక్కు సంప్రదాయంలో జరగనుంది. డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయంలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇవ్వనున్నారు. సినిమా, క్రీడా, రాజకీయ ప్రముఖులు రిసెస్షన్ కు రానున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ లో ఉన్న ఫాంహౌస్ లో సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే మొదలవడంతో యువీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. -
బాలీవుడ్ నటితో యువరాజ్ పెళ్లి
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. నవంబర్ 30న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. డిసెంబర్ 5, 7 తేదీల మధ్య రిసెప్షన్ జరగనుంది. యువరాజ్, హజెల్ కీచ్ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో బాలిలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. యువరాజ్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ జట్టుకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతానికి క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్ లేదు. బ్రిటన్‌కు చెందిన హజెల్ పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో నటించింది. దక్షిణాది సినిమాల్లో కూడా ఆమె కనిపించింది. -
యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, అతడికి కాబోయే భార్య హజల్ కీచ్ కు కోపం వచ్చింది. జాతి వివక్ష చూపారని ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. పియూష్ శర్మ అనే ఉద్యోగి తన పట్ల జాతివివక్ష చూపించాడని హజల్ కీచ్ ట్విట్టర్ లో వెల్లడించింది. తన పేరు హిందూ మతానికి సంబంధించింది కాదన్న సాకుతో తనకు డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడని తెలిపింది. ‘నేను కలిసిన వారిలో జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి. నా పేరు హిందూ మతానికి చెందినది కాదన్న కారణంతో నాకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన నాకు బాధ కలిగించింది. హిందువైన నా తల్లి, నా ముస్లిం ఫ్రెండ్ ఎదురుగా నన్ను అమానించాడు. నా పేరు హజల్ కీచ్. నేను హిందువుగా పుట్టి పెరిగాను. కానీ సమస్య అదికాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్ష చూపిస్తుందా’ అని ప్రశ్నించారు. యువరాజ్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ’పియూష్ శర్మ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనుషులుగా మనమంతా జాతివివక్షను సహించకూడదు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాన’ని యువరాజ్ ట్వీట్ చేశాడు. గతేడాది నవంబర్ లో యువీ-కీచ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. Mr Peeyush Sharma @WesternUnion in Jaipur is the most racist person ive met and refused to give money because my name is not "Hindu" enough — Hazel Keech (@hazelkeech) 30 August 2016 Im sickened by the attitude of these people,in front of my HINDU mother + my muslim friend @1NS1A #outrage #racism https://t.co/Rq7eIyEcWG — Hazel Keech (@hazelkeech) 30 August 2016 My name is Hazel Keech. i am Hindu born/raise. But why does dat matter at @WesternUnion whether2 give me money or no https://t.co/jF7XIzm6Yu — Hazel Keech (@hazelkeech) 30 August 2016 shocking behaviour this is @WesternUnion We all are human beings is that not enough racial discrimination will not be tolerated @hazelkeech — yuvraj singh (@YUVSTRONG12) 30 August 2016 Mr Piyush Sharma @WesternUnion in Jaipur this behaviour will not be tolerated,we would expect some serious action to be taken against him ! — yuvraj singh (@YUVSTRONG12) 30 August 2016 -
యువరాజ్ సెలబ్రేషన్స్ ఇలా..
బెంగళూరు: టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న టీమ్స్ లో ఉన్న ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న యువీ తన ఆనందాన్ని అటు జట్టు సహచరులతో పాటు జీవిత భాగస్వామితో పంచుకున్నాడు. గత ఎనిమిదేళ్ల నుంచి ఐపీఎల్లో యువరాజ్ ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఏ రోజూ కూడా టైటిల్‌ను గెలిచిన జట్టులో లేడు. అయితే సుదీర్ఘ విరామం అనంతరం యువరాజ్ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ తాజా టైటిల్‌ను తన జట్టు సన్ రైజర్స్ గెలవడంతో యువరాజ్ కోరిక తీరింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేవ్. తొలుత చిన్నస్వామి స్టేడియంలో టైటిల్ సెలబ్రేషన్స్ ను సహచరులతో కలిసి ఘనంగా పంచుకున్న యువీ.. సన్ రైజర్స్ జట్టు బస్సు బయల్దేరాక తన సంతోషాన్ని కాబోయే జీవిత భాగస్వామి హజల్ కీచ్‌తో పంచుకున్నాడు. ఆ బస్సులో హజల్ కీచ్ పక్కనే కూర్చున్న యువరాజ్ తన జట్టు టైటిల్ గెలిచిన క్షణాలను ఆస్వాదించాడు. ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ ఆడే చాలా మ్యాచ్‌లకు హాజరైన హజల్ కీచ్..అటు యువరాజ్ ను, జట్టును కూడా ఉత్సాహరుస్తూ ఉండేది. దీంతో సన్ రైజర్స్ క్యాంపులో హజల్ కీచ్ కూడా ఒక సభ్యురాలిగా మారిపోయింది. గతేడాది నవంబర్ లో యువరాజ్ సింగ్-హజల్ కీచ్‌ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ జంట ఎప్పుడూ పెళ్లి పీటలెక్కుతుందనేది దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.