వావ్‌! వారి పెళ్లి ఫస్ట్‌ ఫొటోలు వచ్చేశాయ్‌! | Hazel Keech, Yuvraj Singh wedding photos | Sakshi
Sakshi News home page

వావ్‌! వారి పెళ్లి ఫస్ట్‌ ఫొటోలు వచ్చేశాయ్‌!

Published Wed, Nov 30 2016 4:54 PM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

వావ్‌! వారి పెళ్లి ఫస్ట్‌ ఫొటోలు వచ్చేశాయ్‌! - Sakshi

వావ్‌! వారి పెళ్లి ఫస్ట్‌ ఫొటోలు వచ్చేశాయ్‌!

భారత స్టైలిష్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన జీవితంలో కొత్త ఇన్సింగ్స్‌ ఆరంభించాడు. క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడిన ఈ క్రికెటర్‌ బుధవారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. చండీగఢ్‌లోని గురుద్వారలో బాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌-యువీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

అంతకుముందు మంగళవారం యూవీ వివాహ వేడుకల్లో భాగంగా సంగీత్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాంగ్రా స్టెప్పులతో యూవీ అదరగొట్టాడు. యూవీ వివాహ వేడుకల్లో భారత క్రికెట్‌ జట్టు సభ్యులైన విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, పార్థీవ్‌ పటేల్‌, రహానే తదితరులతోపాటు, భారత జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే పాల్గొన్నారు. సినీ ప్రముఖులు పలువురు కొత్త జంటను ఆశీర్వదించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement